నే స్తుతించెదను

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నే స్తుతించెదను యేసు నామమును
భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని
నిత్యం నిత్యం నే స్తుతించెదను      ||నే స్తుతించెదను||

ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్
వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2)
పాపిని నన్ను రక్షించుటకై
చూపెను ప్రేమనపారముగా (2)     ||నే స్తుతించెదను||

పాపములన్నియు బాపుటకై
శాపములన్నియు మాపుటకై (2)
ఏ పాపమెరుగని ఆ పావనుడు
శాపగ్రాహియై చావొందెను (2)     ||నే స్తుతించెదను||

శోధన కాలముల యందున
వేదన కాలముల యందున (2)
నాధుడు యేసు మనతోడనుండ
అంతమేగా మన చింతలకు (2)     ||నే స్తుతించెదను||

ఎనలేని ప్రేమతో కౌగిలించెను
ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2)
మహామహుండు మహిమ ప్రధానుడు
మహిమతో వచ్చును మేఘముపై (2)     ||నే స్తుతించెదను||

రాజాధిరాజు ప్రభు యేసే
దేవాదిదేవుడు మన యేసే (2)
పరమందు దూతలు యిహమందు నరులు
పాడుడి ప్రభునకు హల్లెలూయా (2)     ||నే స్తుతించెదను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ చిత్తమునే

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist:
Srinivas Bandaru

Telugu Lyrics

నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని
నీ కృపావరమునే దానముగా దయచేసి (2)
నీ ప్రేమలో పరవశించి
నీ సన్నిధిలో నే చేరి
నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను
దేవా… నా దేవా…
నా యేసయ్యా నా రక్షకుడా (2)      ||నీ చిత్తమునే||

హృదయము బద్దలై ఏడ్చిన వేళ
కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2)
నీ చిత్తముకై నే ఎదురు చూసి
నీ బలము పొంద సహియింప చేసి
నా ప్రాణమును తృప్తి పరచితివే       ||దేవా||

నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా
భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2)
నా శత్రువుపైనే జయమునిచ్చి
నా ఆశ్రయమై ధైర్యమును నింపి
నా కోట నీవైతివే       ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఓ నాదు యేసు రాజా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఓ నాదు యేసు రాజా
నిన్ను నే నుతించెదను (2)
నీ నామమును సదా
నే సన్నుతించుచుండును (2) ||ఓ నాదు||

అనుదినము నిను స్తుతియించెదను (2)
ఘనంబు చేయుచుండును నేను (2) ||ఓ నాదు||

వర్ణించెద నే నీ క్రియలను (2)
స్మరియించెద నీ మంచితనంబున్ (2) ||ఓ నాదు||

రక్షణ గీతము నే పాడెదను (2)
నిశ్చయ జయధ్వని నే చేసెదను (2) ||ఓ నాదు||

విజయ గీతము వినిపించెదను (2)
భజియించెద జీవితమంతయును (2) ||ఓ నాదు||

నిరీక్షణ పూర్ణత కలిగి (2)
పరికించెద నా ప్రభు రాకడను (2) ||ఓ నాదు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సర్వ లోకమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం
ప్రభుని నామమును ప్రబల పరచెదం (2)
ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు
స్తుతి మహిమలు సదా అర్పించెదం
అతి సుందరుడు మహిమైశ్వరుడు
ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు       ||సర్వ||

అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు
అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2)
సంతోషించుమా ఆనందించుమా
ఆయన చేసినవి మరువకుమా
సన్నుతించుమా మహిమ పరచుమా
ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు       ||సర్వ||

శోధన వేదన ఏది ఎదురైనా
మొరపెడితే చాలునే విడిపిస్తాడే (2)
రక్షకుడేసు రక్షిస్తాడు
ఆయన నామములో జయం మనదే
ఇమ్మానుయేలు మనలో ఉండగా
జీవితమంతా ధన్యమే ధన్యమే      ||సర్వ||

English Lyrics

Audio

నా ప్రాణమా సన్నుతించుమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2)        ||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2)        ||నా ప్రాణమా||

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2)        ||నా ప్రాణమా||

English Lyrics

Audio

యేసూ ప్రభుని స్తుతించుట

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసూ ప్రభుని స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది (2)
మహోన్నతుడా నీ నామమును
స్తుతించుటయే బహు మంచిది (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా           ||యేసూ ప్రభుని||

విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

ఎంతో గొప్ప రక్షణనిచ్చి
వింతైన జనముగా మేము చేసెను (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడు (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

అతిసుందరుడు అందరిలోన
అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

రాత్రింబవళ్లు వేనోళ్లతోను
స్తుతించుటయే బహుమంచిది (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

English Lyrics

Audio

ఉత్సాహ గానము చేసెదము

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)

అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2)         ||హల్లెలూయ||

వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2)           ||హల్లెలూయ||

English Lyrics

Audio

భజన చేయుచు భక్తపాలక

పాట రచయిత: దొరసామి ఆరోగ్యము
Lyricist: Dorasaami Aarogyamu

Telugu Lyrics

భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును (2)
వృజినములపై జయము నిచ్చిన (2)
విజయుడా నిను వేడుకొందు         ||భజన||

దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు (2)
భవ్యమైన బోధలెన్నో (2)
బాగుగా ధర నేర్పినావు           ||భజన||

నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు (2)
పరుడ నైన నా కొరకు నీ (2)
ప్రాణము నర్పించినావు           ||భజన||

చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు (2)
పడిన నాడు గోతి నుండి (2)
పైకి లేవనెత్తి నావు          ||భజన||

ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు (2)
ఇంతయని వర్ణింప నిలలో (2)
నెవనికిని సాధ్యంబు కాదు          ||భజన||

English Lyrics

Audio

HOME