నమ్మదగిన దేవుడవు

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist: Srinivas Bandaru

Telugu Lyrics


నమ్మదగిన దేవుడవు యేసయ్యా
నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2)
నా తేజోమయుడా నాదు రక్షకా
నను విడిపించిన నా విమోచకా (2)
నీ శరణు జొచ్చితి ఆదరించుము
సేదదీర్చి నీ అక్కున చేర్చుము
యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము     ||నమ్మదగిన||

నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే
నీ కృపా వార్తను వినిపించుము (2)
నా పూర్ణ హృదయముతో ఆత్మతో
కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2)         ||నీ శరణు||

నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే
నను రక్షించుటకై చేయి చాచితివే (2)
పదితంతుల సితారతో గానముతో
స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2)         ||నీ శరణు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు ఒక్కడే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు
క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2)
నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2)
ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)           ||యేసు||

పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు
కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2)          ||హల్లెలూయా||

దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము
ఈ భువిలో వెలసిన మానవ రూపము (2)          ||హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నమ్మదగిన దేవుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నమ్మదగిన దేవుడా
నెమ్మదినిచ్చే యేసయ్యా (4)
నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2)
నీ తోడుంటే చాలయ్యా
భయమే నాకు లేదయ్యా (2)      ||నీ తోడుంటే||

శ్రమ అయినా బాధ అయినా
కరువైనా ఖడ్గమైనా (2)      ||నీ తోడుంటే||

కష్టమైనా కన్నీరైనా
కలతలైనా కలవరమైనా (2)      ||నీ తోడుంటే||

సాగరాలే ఎదురు నిలిచినా
శత్రువులంతా నన్ను తరిమినా (2)      ||నీ తోడుంటే||

భరువైనా భారమైనా
బాధ అయినా వేదనైనా (2)      ||నీ తోడుంటే||

ఎవరున్నా లేకున్నా
కలిమి అయినా లేమి అయినా (2)      ||నీ తోడుంటే||

English Lyrics

Audio

నా యేసయ్యా నా రక్షకా

పాట రచయిత: కృపల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)

ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)

నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)      ||ప్రేమింతును||

నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)      ||ప్రేమింతును||

English Lyrics

Audio

Chords

నీకంటె నమ్మదగిన

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా      ||నీకంటె||

కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే (2)
బాధించినా స్వస్థపరిచేది నీవే (2)       ||నీకంటె||

అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే (2)
శిక్షించినా గొప్ప చేసేది నీవే (2)          ||నీకంటె||

విడువబడిన వేళ
నను చేరదీసినావే (2)
కోపించినా కరుణ చూపేది నీవే (2)      ||నీకంటె||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME