లివింగ్ హోప్ (తెలుగు)

పాట రచయిత: ఫిల్ విక్ఖమ్
అనువదించినది: పాల్ & సౌభాగ్య
Lyricist: Phil Wickham
Translators: Paul & Sowbhagya

Telugu Lyrics

మన మధ్యన దూరం ఎంతో ఎత్తైనది
మేమెక్కలేనంత ఎత్తైన పర్వతం
నిరాశలో మేము నీ వైపు చూచి
నీ నామములో విడుదలను ప్రకటించితిమి
అంధకారము తొలగించి
మా ఆత్మను రక్షించి
నీ ప్రేమతో మమ్ము నింపినావయ్యా
పరిపూర్ణమైనది నీవు రచియించిన అంతం
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ

ఊహలకు అందనిది నీ కరుణ కటాక్షం
మాపై కురిపించితివి సమృద్ధిగను
యుగయుగములకు రాజా నీ మహిమను విడచి
మా శాప భారము నీవే భరియించితివి
నీ సిలువలో మేము పొందితిమి క్షమాపణ
మేము నీవారిగా మార్చబడితిమి
సుందరుడా యేసయ్యా మేము నీ వారము
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ

హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్
హల్లెలూయా నీవు మరణము గెలిచితివి
నీ నామంలో రక్షణను
మాకు విజయమునిచ్చితివి
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2)

నీవు లేచిన ఉదయాన నెరవేరెను వాగ్ధానం
నిర్జీవ శరీరం శ్వాసించెనుగా
నిశ్శబ్దములో నుండి నీవు పలికిన జయభేరి
“ఓ మరణమా నీ జయమెక్కడ?” (2)
యేషువా నీకే జయమెప్పుడు

హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్
హల్లెలూయా నీవు మరణము గెలిచితివి
నీ నామంలో రక్షణను
మాకు విజయమునిచ్చితివి
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2)
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ – (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అయ్యా వందనాలు

పాట రచయిత: జేమ్స్ ఎజెకియెల్
Lyricist: James Ezekial

Telugu Lyrics

అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే (2)

మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే (2)
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2)       ||అయ్యా||

అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే (2)
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2)       ||అయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అద్భుతకరుడా

పాట రచయిత: ఓసీనాచి ఒకోరో
అనువదించినది:
అలెన్ గంట, జాన్ ఎర్రి, అను శామ్యూల్, జాన్ డేవిడ్ ఇంజ
Lyricist: Osinachi Okoro
Translator(s): Allen Ganta, John Erry, Anu Samuel, John David Inja

Telugu Lyrics

మా మధ్యలో సంచరించువాడా
ఆరాధన నీకేనయ్యా
మా మధ్యలో అద్భుతాలు చేయువాడా
ఆరాధన నీకేనయ్యా

మార్గము తెరిచే అద్భుతకరుడా
మాట తప్పని తేజోమయుడా
నీవే.. నీవే యేసయ్యా (2)

మాలో నీవు హృదయాలు మార్చుము
యేసయ్యా యేసయ్యా..
మా మనసులను స్వస్థపరచుము
యేసయ్యా యేసయ్యా.. నీవే        ||మార్గము||

చీకటి లోయలో సంచరించినా
నిరీక్షణ కోల్పోయినా
గొప్ప కార్యము జరిగించెదవు
నాలో నెరవేర్చెదవు (2)        ||మార్గము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఈ మరణము కాదు

పాట రచయిత: సాయారాం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము (2)
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2)     ॥ఈ మరణము॥

జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2)
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2)
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ      ॥ఈ మరణము॥

యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు (2)
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో (2)
కొలువు తీరెదరు పరలోకంలో     ॥ఈ మరణము॥

కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును (2)
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును (2)
గతకాల సంగతులు గతించి పోవును     ॥ఈ మరణము॥

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిబంధనా జనులం

పాట రచయిత: కే రాజబాబు
Lyricist: K Rajababu

Telugu Lyrics

నిబంధనా జనులం
నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం
మేము నిబంధనల జనులం
యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే
మోక్షమందు చేరెదము (2)           ||నిబంధనా||

అబ్రాహాము నీతికి వారసులం
ఐగుప్తు దాటిన అనేకులం (2)
మోషే బడిలో బాలురము (2)
యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

విశ్వాసమే మా వేదాంతం
నిరీక్షణే మా సిద్ధాంతం (2)
వాక్యమే మా ఆహారం (2)
ప్రార్ధనే వ్యాయామం – అనుదినము
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

అశేష ప్రజలలో ఆస్తికులం
అక్షయుడేసుని ముద్రికులం (2)
పునరుత్తానుని పత్రికలం (2)
పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

నజరేయుని ప్రేమ పొలిమేరలో
సహించుటే మా ఘన నియమం (2)
క్షమించుటే ఇల మా న్యాయం (2)
భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

క్రీస్తేసే మా భక్తికి పునాది
పునరుత్తానుడే ముక్తికి వారధి (2)
పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2)
ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

ఎవరీ యేసుని అడిగేవో
ఎవరోలే యని వెళ్ళేవో (2)
యేసే మార్గం యేసే జీవం (2)
యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం
నిబంధనా జనులం           ||యేసు రాజు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రిస్మస్ అంటేనే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)

క్రీస్తులోనే విశ్వాసం
క్రీస్తులోనే ఉల్లాసం
క్రీస్తులోనే అభిషేకం
క్రీస్తులోనే సమస్తం (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)      ||క్రిస్మస్||

యేసులోనే రక్షణ
యేసులోనే స్వస్థత
యేసులోనే విడుదల
నమ్మితే నిత్య జీవం (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)      ||క్రిస్మస్||

English Lyrics

Audio

పరిశుద్ధుడా పావనుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే (2)
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా (2)
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే (6)

నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై (2)
నా ఊపిరి నా గానము
నా సర్వము నీవే నా యేసయ్యా
నీకేనయ్యా ఆరాధన             ||ఆరాధన||

నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా (2)        ||ఆరాధన||

English Lyrics

Audio

ఆరాధన నీకే

పాట రచయిత: షాలోమ్ బెన్హర్ మండ
Lyricist: Shalom Benhur Manda

Telugu Lyrics

పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే (2)
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా (2)
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే – ఆరాధన నీకే
ఆరాధన నీకే (2)

నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై (2)
నా ఊపిరి నా గానము నా సర్వము నీవే
నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన       ||ఆరాధన||

నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా (2)       ||ఆరాధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవునియందు నిరీక్షణ నుంచి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)

ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)      ||దేవుని||

చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2)      ||దేవుని||

నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2)      ||దేవుని||

తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2)      ||దేవుని||

నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2)      ||దేవుని||

పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2)      ||దేవుని||

స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)      ||దేవుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కృంగిన వేళలో

పాట రచయిత: చేతన్ మంత్రి
Lyricist: Chetan Mantri

Telugu Lyrics

కృంగిన వేళలో – ఆపద సమయములో
నా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవే
నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి
యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని
నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2)

నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతిని
నీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివి
నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి
యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని
నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2)

English Lyrics

Audio

Chords

 

 

HOME