స్తుతి ప్రశంస పాడుచు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (2)
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2)

పాపలోక బంధమందు దాసత్వమందుండ (2)
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2)      ||స్తుతి ప్రశంస||

పాప భారముచే నేను దుఃఖము పొందితి (2)
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు (2)      ||స్తుతి ప్రశంస||

హృదయాంధకారముచే నేను దారి తొలగితి (2)
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె (2)      ||స్తుతి ప్రశంస||

పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి (2)
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి (2)      ||స్తుతి ప్రశంస||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పేతురు వలె నేను

పాట రచయిత: జాస్పర్ కునపో
Lyricist: Jasper Kunapo

Telugu Lyrics

ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును (2)
అత్యున్నత ప్రేమను కనుపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2)        ||ఆరాధ్యుడవు||

పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2)
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా (2)        ||ఆరాధ్యుడవు||

ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2)
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసెను (2)        ||ఆరాధ్యుడవు||

నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా (2)
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2)        ||ఆరాధ్యుడవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పదివేలలో అతిసుందరుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

పదివేలలో అతిసుందరుడా
నిన్ను నే ఆరాధింతున్
సూర్యచంద్రులకన్న తేజోమయుడా
నిత్యము ఆరాధింతున్
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ – యోగ్యునిగా మార్చితివే
ఏ ఆధారంలేని నాకై నీవూ – ఆధారణను తప్పించితివే
నన్ను ప్రేమించి రక్షించితివే
నీ కృపను చూపించితివే
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

ఈ లోకపు సృష్టి యేసను నామమును – ఘనపరచి కీర్తింతునే
తన న్యాయపీఠమెదుట – ప్రతి మోకాలు తప్పక వంగునే
పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడా
యోగ్యుడా యోగ్యుడా పూజకు అర్హుడా
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నేనెల్లప్పుడు యెహోవా నిను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు||

కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలకిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము గుండెనే పిండినా (2)
నా మొఱ విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా (2)
ఆపదలలో విడిపించెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చూడాలని ఉన్నది

పాట రచయిత: రవిందర్ వొట్టెపు
Lyricist: Ravinder Vottepu

Telugu Lyrics

చూడాలని ఉన్నది
నా యేసుని చూడాలని ఉన్నది (2)
కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని
కొనియాడుచుండగా చూడాలని (2)       ||చూడాలని||

పగలు ఎగురు బాణమైనను
రాత్రి కలుగు భయముకైనను (2)
కదలక నను కాపాడే నా నాథుడే నీవే
ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2)       ||చూడాలని||

నా పాదములకు దీపమై
నా త్రోవలకు వెలుగువై (2)
నను వీడని ఎడబాయని నా తోడువు నీవే
కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2)       ||చూడాలని||

English Lyrics

Audio

సంవత్సరములు వెలుచుండగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2)    ||సంవత్సరములు||

గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)
శత్రువల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు (2)     ||నీకే||

బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు
పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)
నూతన క్రియలతో నను నింపినావు
సరి కొత్త తైలముతో నను అంటినావు (2)     ||నీకే||

English Lyrics

Audio

ఆరాధనకు యోగ్యుడా

పాట రచయిత: జ్యోతి రాజు
Lyricist: Jyothi Raju

Telugu Lyrics

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)

దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
ఆరాధన ఆరాధన (2)
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)

ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రత ననుభవించినావు (2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)          ||ఆరాధనకు||

English Lyrics

Audio

యేసయ్యా నా హృదయాభిలాష

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2)

పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా        ||యేసయ్యా||

ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా         ||యేసయ్యా||

English Lyrics

Audio

నా యేసయ్యా నా స్తుతియాగము

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా యేసయ్యా నా స్తుతియాగము
నైవేద్యమునై ధూపము వోలె
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2)

ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు (2)
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా (2)
విజ్ఞాపన చేయుచున్నావా       ||నా యేసయ్యా||

ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు (2)
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా (2)
మరణ భయము తొలగించితివా         ||నా యేసయ్యా||

మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు (2)
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు (2)
రారాజుగా దిగి వచ్చెదవు        ||నా యేసయ్యా||

English Lyrics

Audio

జీవితాంతము నే నీతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


జీవితాంతము నే నీతో నడవాలని
ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని
నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని
నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని
నా మనసంతా నీవే నిండాలని
తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక
పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని
యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా (2)
దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా (2)

నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను
నీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను (2)
నరుని నమ్ముటే నాకు మోసమాయెను
భయముతోటి నా కన్ను నిద్ర మరచెను (2)
మనసులోన మానిపోని గాయమాయెను (2)
నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2)         ||పడితినయ్యా||

లోక పొగడ్తలకు నే పొంగిపోతిని
దాని కనుసైగలోన నేను నడచుకొంటిని (2)
చెడ్డదైన బ్రతుకు సరి జేయ జూసితి
ప్రయాసము వ్యర్ధమై నే నిరసిల్లితి (2)
ముగిసిపోయెననుకుంటి నా ప్రయాణము (2)
నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2)         ||పడితినయ్యా||

English Lyrics

Audio

HOME