ఎనలేని ప్రేమ

పాట రచయిత: సృజిత్ మనూక
Lyricist: Srujith Manuka

Telugu Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నరునిగా వచ్చిన నా దేవా
నా పాపము కొరకు రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవా (2)
ఊహించగలనా వర్ణింప తగునా
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము         ||ఎనలేని||

కొరడాలతో హింసించినా
మోముపై ఉమ్మి వేసినా (2)
చెమట రక్తముగా మారినా (2)          ||ఊహించగలనా||

ముళ్ల కిరీటముతో మొత్తినా
బల్లెముతో ప్రక్క పొడచినా (2)
పరలోక తండ్రియే చేయి విడచినా (2)          ||ఊహించగలనా||

English Lyrics

Audio

సిలువలో నీ ప్రేమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2)      ||సిలువలో||

తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2)     ||ఘోర పాపిని||

దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2)
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి (2)     ||ఘోర పాపిని||

అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2)
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2)     ||ఘోర పాపిని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మన మధ్యనే ఉన్నది

పాట రచయిత: పి ఐసాక్
Lyricist: P Isaac

Telugu Lyrics


మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2)
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు లేనే లేదు
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు అసలే లేవు
నీ రాజ్యం మాకొచ్చును గాక
నీ చిత్తం భువిపై జరుగును గాక
పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము
ఇప్పుడే అనుభవిస్తాము – (2)
ఇక్కడే అనుభవిస్తాము

సిలువలో మన శాపం తొలగిపోయెను
ఆశీర్వాదముకు మనము వారసులం
దారిద్య్రముతో లేదు మాకు సంబంధం
ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మాకిక సొంతము
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మా సొంతము           ||నీ రాజ్యం||

ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై
కలసి జీవించుటయే పరలోక రాజ్యం
కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు
సంతోషముతో మేము సాగిపోతాము
ఈ తరానికి మాదిరిగా మేముంటాము
పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2)         ||నీ రాజ్యం||

English Lyrics

Audio

శుద్ధుడవయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
పాపము బాప వచ్చితివయ్యా
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా
సిద్ధపడే శుద్ధ దేహం
సిలువనెక్కె సందేశం
ఆసనమో తండ్రి చిత్తం
ఆరంభమో కల్వరి పయనం      ||శుద్ధు||

చెమట రక్తముగా మారెనే
ఎంతో వేదనను అనుభవించే
ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు
జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2)          ||సిద్ధపడే||

చిందించె రక్తము నా కొరకే
ప్రవహించే రక్తము పాపులకై
రక్తపు బొట్టు ఒకటి లేకపోయే
ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే (2)          ||సిద్ధపడే||

English Lyrics

Audio

నన్ను కావగ వచ్చిన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యా
నేను పాపము చేసినా చూపావు నీ దయా
నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా
సిలువ నీడలో నన్ను దాచుమయ్యా
లోకమంతా నన్ను దోషిగ చూసినా
ప్రేమతోనే నన్ను చేరదీసిన           ||నన్ను||

నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యా
లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా
అందరు నన్ను అనాథ చేసి పోయినా
అంధకారమే నాకు బంధువై మిగిలినా
నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా          ||నన్ను||

నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా
నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే
ఏ యోగ్యత నాకు లేకపోయినా
నీ వారసునిగా నన్ను ఎంచిన
ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా            ||నన్ను||

English Lyrics

Audio

యేసయ్య మాట జీవింపజేయు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్య మాట జీవింపజేయు లోకంలో
యేసయ్య నామం కోరికలన్ని తీర్చును
యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము
యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2)        ||యేసయ్య||

వ్యభిచార స్త్రీ యొక్క పాపము
క్షమించె యేసు దేవుడు (2)
ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2)
ఇదే కదా యేసు ప్రేమ
క్షమించు ప్రతి పాపము (2)

విరిగి నలిగినా హృదయమా
యేసుపై వేయుము భారము (2)
నీ దుఃఖ దినములు సమాప్తము
యేసుని అడిగినచో (2)
ఇదే కదా యేసు ప్రేమ
కన్నీటిని తుడిచివేయును (2)         ||యేసయ్య||

English Lyrics

Audio

కల్వరి సిలువలో

పాట రచయిత: డేవిడ్ విజయరాజు గొట్టుముక్కల
Lyricist: David Vijayaraju Gottumukkala

Telugu Lyrics


కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)
క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే
పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే

కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే
కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే
సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే

విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే
విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే
శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే

వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే
ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే

అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే
ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)

English Lyrics

Audio

ఉన్నపాటున వచ్చుచున్నాను

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushothamu Chowdary

Telugu Lyrics

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను          ||ఉన్న||

కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని
ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ            ||ఉన్న||

మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను
అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని           ||ఉన్న||

వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను
పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే
నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె            ||ఉన్న||

కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె             ||ఉన్న||

నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని
కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని
భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె         ||ఉన్న||

దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు
డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే          ||ఉన్న||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నన్నెంతగానో ప్రేమించెను

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను (2)     ||నన్నెంత||

సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2)          ||నన్నెంత||

సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)          ||నన్నెంత||

కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2)          ||నన్నెంత||

ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2)          ||నన్నెంత||

English Lyrics

Audio

అందరికి కావాలి

పాట రచయిత: శైలన్న
Lyricist: Sailanna

Telugu Lyrics

అందరికి కావాలి యేసయ్య రక్తము (2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము (2)

కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము (2)
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము (2)            ||అందరికి||

కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది (2)           ||అందరికి||

చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము (2)
రక్తములోనే ప్రాణమున్నది
పాపము కడిగే గుణమున్నది (2)
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది (2)          ||అందరికి||

English Lyrics

Audio

HOME