ముళ్ళ కిరీటము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


ముళ్ళ కిరీటము రక్త ధారలు
పొందిన గాయములు జాలి చూపులు
చల్లని చేతులు పరిశుద్ధ పాదములు
దిగిన మేకులు వేదన కేకలు
ఎంత గొప్పది యేసు నీ హృదయము
మా కోసమే ఇన్ని బాధలా
ఇంత ప్రేమ ఏలనో

సన్నుతింతుము సత్యవంతుడా
నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో
యేసు నీ త్యాగము మరువలేనిది
మా జీవితాలకు విలువ నిచ్చినది

ముళ్ళ కిరీటము రక్త ధారలు
పొందిన గాయములు జాలి చూపులు

లోక పాపము సిలువ భారము
జనుల పక్షము ఘోర మరణము
తండ్రి కార్యము పునరుద్దానము
ఉచిత దానము నిత్య జీవము
యేసు నీ కృప మాకు చాలును
నీ నీతియే మాకు సంపద
నిన్ను కీర్తించుట దీవెన

మా విమోచకా మా రక్షణాధారమా
అందుకోవయా మా స్తుతి అర్పణములు
వందనం ప్రభు వందనం నీకు
నీ ప్రాణదానముకై సదా వందనం

లోక పాపము సిలువ భారము
జనుల పక్షము ఘోర మరణము
తండ్రి కార్యము పునరుద్దానము
ఉచిత దానము నిత్య జీవము

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ప్రియ యేసు మన కొరకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం (2)    ||ప్రియ యేసు||

కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం (2)    ||ప్రియ యేసు||

పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను (2)    ||ప్రియ యేసు||

English Lyrics

Audio

దేవుడు దేహమును

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


దేవుడు దేహమును పొందిన దినము
మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)
తార వెలిగెను – దూత పాడెను
పరలోకనికి మార్గము వెలిసెను (2)
స్తుతుల గానములు పాడి పరవశించెదము
యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)

దూత పలికెను భయము వలదని
తెలిపే వార్తను యేసే క్రీస్తని (2)
చీకటి తొలగెను రారాజుకు భయపడి
లోకము వెలిగెను మరణము చెరవిడి (2)
క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2)       ||దేవుడు||

సృష్టి కారుడు అల్పుడాయెను
అది శాపము తీయ వచ్చెను (2)
పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
మానవ జాతికి మార్గమై నిలిచెను (2)
నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2)       ||దేవుడు||

English Lyrics

Audio

శిరము మీద ముళ్ల సాక్షిగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ల సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా (2)
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు (3)

సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని (2)
మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
యేసులోనే నెరవేరెనుగా

సర్వ పాప పరిహారో
రక్త ప్రోక్షణం అవశ్యం
తద్ రక్తం పరమాత్మేనా
పుణ్య దాన బలియాగం

ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ        ||శిరము||

మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని (2)
కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా

చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
వృషభో రోర వీతి మహో దేవో
మద్యామ్ ఆవివేశత్తిథి

బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
యేసులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా       ||శిరము||

English Lyrics

Audio

కలువరి గిరి సిలువలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2)         ||కలువరి||

కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – (2)         ||కలువరి||

జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – (2)         ||కలువరి||

English Lyrics

Audio

HOME