ప్రేమతో యేసు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము (2)
రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము (2)      ||ప్రేమతో||

పాపమెరుగని ప్రభు నీ కొరకు
పాపముగను చేయబడెను (2)
శాపగ్రాహియాయె సిలువలో
శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

ముండ్ల కిరీటమును ధరించి
ముఖముపై నుమ్మి వేయబడె (2)
ప్రాణమిడె నేసు సిలువలో
ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

సిలువలో నీకై దప్పిగొని
కలుష నీ క్షమకై ప్రార్థించి (2)
సహించి ప్రాణమిడె నీ కొరకు
సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

తప్పిన గొర్రెను రక్షింప
తనదు రక్తమును చిందించె (2)
కాపరి స్వరము ధ్వనించె
కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

తామసించ తగదిక ప్రియుడా
త్వరపడుము నీ రక్షణ కొరకు (2)
నేడే నీ రక్షణ దినము
నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

తానే కడుగును తన రక్తముతో
తండ్రివలె నీ పాపమునంత (2)
తనయుడవై పోదు విపుడే
తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

ప్రేమవార్త ప్రకటింపబడె
ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము (2)
కృపాకాలమిదే జాగేల
కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

Download Lyrics as: PPT

నా ఊహకందని ప్రేమతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2)
నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు
నీ సాక్షిగా నను నిలిపావు (2)          ||నా ఊహకందని||

అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని
దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే (2)
ఏనాడు అనుకోలేదు
నన్ను నీవు ఎన్నుకుంటావని (2)          ||నా ఊహకందని||

జీవితమంతా శూన్యమైపోగా
నాకున్న వారే నన్ను విడచిపోగా (2)
ఏనాడు అనుకోలేదు
నాకు తోడుగా నీవుంటావని (2)          ||నా ఊహకందని||

నా జీవితాన్ని నీవు మార్చినావు
నీ సేవలోనే నన్ను నిల్పినావు (2)
ఏనాడు అనుకోలేదు
నా జీవితం ఇలా మారుతుందని (2)          ||నా ఊహకందని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యుగయుగాలు మారిపోనిది

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics


యుగయుగాలు మారిపోనిది
తరతరాలు తరిగిపోనిది
ప్రియ యేసు రాజు నీ ప్రేమా
నిను ఎన్నడు వీడిపోనిది
నీకు ఎవ్వరు చూపలేనిది
ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది
హద్దే లేని ఆ దివ్య ప్రేమతో
కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో
నీ కోసమే బలి అయిన దైవము రా (2)

లోకంతో స్నేహమొద్దు రా
చివరికి చింతే మిగులు రా
పాపానికి లొంగిపోకు రా
అది మరణ త్రోవ రా (2)
నీ దేహం దేవాలయము రా
నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2)      ||హద్దే||

తను చేసిన మేలు ఎట్టిదో
యోచించి కళ్ళు తెరువరా
జీవమునకు పోవు మార్గము
క్రీస్తేసుని ఆలకించారా (2)
నీ ముందర పందెము చూడరా
విశ్వాసపు పరుగులో సాగరా (2)      ||హద్దే||

English Lyrics

Audio

ప్రియ యేసు మన కొరకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం (2)    ||ప్రియ యేసు||

కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం (2)    ||ప్రియ యేసు||

పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను (2)    ||ప్రియ యేసు||

English Lyrics

Audio

నా కలవరములన్ని

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Telugu Lyrics


నా కలవరములన్ని కనుమరుగు చేసినావు
నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

నీ చేయి నన్ను సంరక్షించెను
నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి
శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు
జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2)       ||నా కలవరము||

నిన్ను నమ్మువారు సీయోనులో చేరి
నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2)       ||నా కలవరము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

శాశ్వతమైన ప్రేమతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా
నీ ప్రేమే నను గెల్చెను
విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా
నీ కృపయే నను మార్చెను
నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం
నీ ప్రేమ తేనె కంటే మధురము
నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా
నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను వెంబడింతును
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను ఆరాధింతును           ||శాశ్వతమైన||

నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా
దృష్టించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే
గ్రంధములో లిఖియించిన ప్రేమ
నా ఎముకలను నా అవయములను
వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు
నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నీ కోసం సృజియించావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను మురిపెంగా లాలించావయ్యా            ||శాశ్వతమైన||

నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు
నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు
నా కోసం వేచిచూచిన ప్రేమ
బాల్య దినముల నుండి నను సంరక్షించి
కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో నను కలిసి
సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నను దర్శించినావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను ప్రత్యేకపరిచావేసయ్యా            ||శాశ్వతమైన||

నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ
తన సొత్తుగా చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి
నా విలువని పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి చులకన చేసినను
తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా
నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ
నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ
యేసయ్యా… యేసయ్యా…
నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…
నను నీలా మార్చేందులకేనయ్యా           ||శాశ్వతమైన||

పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు
కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ
నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి
తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా
షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నను మరలా సమకూర్చావేసయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా           ||శాశ్వతమైన||

కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన
నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో
తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ
లోకమే మారిననూ మనుషులే మరచిననూ
మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి
ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నా విశ్వాసం కాపాడవయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
బంగారంలా మెరిపించావయ్యా            ||శాశ్వతమైన||

ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి
నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని
అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ
శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే
సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
శాశ్వత జీవం నాకిచ్చావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను చిరకాలం ప్రేమిస్తావయ్యా        ||శాశ్వతమైన||

English Lyrics

Audio

శాశ్వత ప్రేమతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)

అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2)        ||నీ ప్రేమ||

అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2)        ||నీ ప్రేమ||

తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి (2)        ||నీ ప్రేమ||

నడుచుచున్న మర్గమంత యోచించగా
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2)        ||నీ ప్రేమ||

ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
సమస్తము మేలుకై చేసిన దేవా (2)        ||నీ ప్రేమ||

English Lyrics

Audio

లోకాన ఎదురు చూపులు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో (2)
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో (2)
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

English Lyrics

Audio

నేస్తమా ప్రియ నేస్తమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా
మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా (2)

వేదన బాధలలో కృంగిన సమయములో
నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు
చీకటి తొలగించి మహిమతో నింపినావు
పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు         ||నేస్తమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిత్య ప్రేమతో

పాట రచయిత: శామ్యూల్ విల్సన్
అనువాదకులు: జీవ ఆర్ పాకెర్ల
Lyricist: Samuel Wilson
Translator: Jeeva R Pakerla

Telugu Lyrics

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగ జీవింతున్

నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
ఏక రక్షకుడు యేసే
లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)
నా సర్వము నీకే అర్పింతును
పూర్ణానందముతో నీకే అర్పింతున్

నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)
మేఘ రథములపై రానైయున్నాడు
యేసు రాజుగ రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి (2)
స్వర్గ రాజ్యములో యేసున్
సత్య దైవం యేసున్

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME