నన్ను కాదనవని

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


నన్ను కాదనవని – నను కాదనలేవని
నీ చెంతకు నే చేరినా (2)
నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని
నీ మనసే నే కోరినా (2)          ||నన్ను||

లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే
అలసి నీ చెంత చేరినా (2)
సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన
నీవే నా దిక్కని ఎంచినా – (2)          ||నన్ను||

లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే
సొలసి నీ శరణు కోరినా (2)
శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన
నీవే ఆధారమని యెంచినా – (2)          ||నన్ను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

శిలనైన నన్ను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేసావు (2)
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

మోడుబారిన నా జీవితం
నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)
నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

English Lyrics

Audio

కలలా ఉన్నది

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics

కలలా ఉన్నది నేనేనా అన్నది
నిజమౌతున్నది నీవు నాతో అన్నది
నిరాశల నిశిలోన – ఉషోదయం వచ్చింది
యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2)      ||కలలా||

మనుష్యులంతా మనసే గాయపరిచి
పురుగల్లె నను నలిపేయ జూచినా (2)
శూరుడల్లె వచ్చినావు
నాకు ముందు నిలచినావు
నాకు బలము ఇచ్చినావు
ఆయుధంగా మార్చినావు
చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ      ||కలలా||

శూన్యములో నాకై సృష్టిని చేసి
జీవితాన్ని అందముగా మలచేసి (2)
మాట నాకు ఇచ్చినవారు
దాన్ని నెరవేర్చువారు
నిన్ను పోలి ఎవరున్నారు
నన్ను ప్రేమించువారు
యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ      ||కలలా||

English Lyrics

Audio

మధురం మధురం నీ ప్రేమే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం
అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం
ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2)
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2)        ||మధురం||

నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ
నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2)
సర్వోన్నతుడా సహాయకుడా
మరువగలనా నీ ప్రేమను (2)        ||మధురం||

సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ
కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2)
మహోన్నతుడా మహా ఘనుడా
మరువగలనా నీ ప్రేమను (2)        ||మధురం||

English Lyrics

Audio

ప్రేమ లేనివాడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు
ప్రేమించలేని నాడు – తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2)
ప్రేమ నేర్పించాలని నిన్ను – ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు
ప్రేమ చూపించాలని నీకు – తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు
ప్రేమే జీవన వేదం – ప్రేమే సృష్టికి మూలం
ప్రేమే జగతికి దీపం – ప్రేమలోనే నిత్య జీవితం
ప్రేమే అంతిమ తీరం – ప్రేమే వాక్యపు సారం
ప్రేమే సత్య స్వరూపం – ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం         ||ప్రేమ లేనివాడు||

మంచి వాని కొరకు సహితము – ఒకడు మరణించుట అరుదు
పాపులకై ప్రాణమిచ్చిన – ప్రేమకు కట్టలేము ఖరీదు
ద్రోహియైన యూదానే ఆయన – కడవరకు విడువలేదు
అప్పగించువాడని తెలిసి – బయటకు నెట్టివేయలేదు
దొంగ అని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా
ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా
వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా
చివరి వరకు వాడిని మార్చాలని చూసాడురా
ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగియున్నవాడే
నిజ క్రైస్తవుడౌతాడురా
ప్రేమే దేవుని రూపం – ప్రేమే క్రీస్తు స్వరూపం
ప్రేమే కడిగెను పాపం – ప్రేమ జీవ నదీ ప్రవాహం       ||ప్రేమ లేనివాడు||

కాలు ఎదిగిపోతుందని – ఓర్వలేక కన్ను బాధపడదు
కంటిలోని నలుసు పడితే – సంబరంతో కాలు నాట్యమాడదు
చేయి లేచి చెవిని నరుకదు – పేగు గుండెను ఉరి తీయదు
వేలు తెగితే నోరు నవ్వదు – అసూయ అవయవాలకుండదు
సంఘమంటే యేసు క్రీస్తు శరీరమే సోదరా
మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా
ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా
ఈ భావం బాధపడితే అభ్యంతర పరచకురా
ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరచిననాడే
క్రీస్తు నీలో ఉంటాడురా
ప్రేమే ఆత్మకు ఫలము – ప్రేమే తరగని ధనము
ప్రేమే పరముకు మార్గము – ప్రేమ వరము నిత్యజీవము           ||ప్రేమ లేనివాడు||

ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే – లేదు ఏ ప్రయోజనం
ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే – గణ గణలాడే తాళం
వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే – ఒప్పుకోదు వాక్యం
పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా – క్రీస్తు యేసు ముఖ్యం
మారాలని మార్చాలని కోరేది ప్రేమరా
నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా
ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏం గొప్పరా
శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా
ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహియించినవాడే
పరలోకం వెళతాడురా
స్వార్ధ్యం లేనిది ప్రేమ – అన్నీ ఓర్చును ప్రేమ
డంభం లేనిది ప్రేమ – అపకారములే మరచును ప్రేమ
ఉప్పొంగని గుణమే ప్రేమ – కోపం నిలుపదు ప్రేమ
అన్నీ తాలును ప్రేమ – మత్సరమే పడనిది ప్రేమ
దయనే చూపును ప్రేమ – దరికే చేర్చును ప్రేమ
సహనం చూపును ప్రేమ – నిరీక్షణతో నిలుచును ప్రేమ
క్షమనే కోరును ప్రేమ – ద్వేషం చూపదు ప్రేమ
ప్రాణం నిచ్చిన ప్రేమ – దోషములే కప్పును ప్రేమ

English Lyrics

Audio

శాశ్వతమైన ప్రేమతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా
నీ ప్రేమే నను గెల్చెను
విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా
నీ కృపయే నను మార్చెను
నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం
నీ ప్రేమ తేనె కంటే మధురము
నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా
నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను వెంబడింతును
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను ఆరాధింతును           ||శాశ్వతమైన||

నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా
దృష్టించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే
గ్రంధములో లిఖియించిన ప్రేమ
నా ఎముకలను నా అవయములను
వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు
నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నీ కోసం సృజియించావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను మురిపెంగా లాలించావయ్యా            ||శాశ్వతమైన||

నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు
నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు
నా కోసం వేచిచూచిన ప్రేమ
బాల్య దినముల నుండి నను సంరక్షించి
కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో నను కలిసి
సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నను దర్శించినావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను ప్రత్యేకపరిచావేసయ్యా            ||శాశ్వతమైన||

నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ
తన సొత్తుగా చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి
నా విలువని పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి చులకన చేసినను
తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా
నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ
నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ
యేసయ్యా… యేసయ్యా…
నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…
నను నీలా మార్చేందులకేనయ్యా           ||శాశ్వతమైన||

పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు
కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ
నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి
తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా
షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నను మరలా సమకూర్చావేసయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా           ||శాశ్వతమైన||

కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన
నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో
తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ
లోకమే మారిననూ మనుషులే మరచిననూ
మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి
ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నా విశ్వాసం కాపాడవయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
బంగారంలా మెరిపించావయ్యా            ||శాశ్వతమైన||

ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి
నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని
అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ
శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే
సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
శాశ్వత జీవం నాకిచ్చావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను చిరకాలం ప్రేమిస్తావయ్యా        ||శాశ్వతమైన||

English Lyrics

Audio

నీ ప్రేమే నాకు చాలయ్యా

పాట రచయిత: టోనీ ప్రకాష్
Lyricist: Tony Prakash

Telugu Lyrics

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)
నీ దీవెనా నాకు చాలయ్యా (2)
ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

నన్ను ప్రేమించి నన్నాదరించి
నీ సన్నిధిలో నను నిలిపితివి (2)         ||నీ దీవెనా||

ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా
నీవు నన్ను మరువని దేవుడవు (2)           ||నీ దీవెనా||

కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా
నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)
నీ సువార్తను నే చాటెదను (2)
ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

English Lyrics

Audio

నేడే ప్రియరాగం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నేడే ప్రియరాగం పలికే నవ గీతం
ప్రేమే మన కోసం వెలసే
లోకాన శాంతి మురిసింది
మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది        ||నేడే||

దివినేలు దేవుడు ఉదయించగానే
ఇలలోన ప్రకృతి పులకించెగా
పరలోక దూతలు స్తుతియించగానే
జగమంతా ఉప్పొంగి నర్తించెగా           ||నేడే||

మనిషైన సుతుడు జనియించగానే
విశ్వాన గోళాలు విభవించెగా
చిన్నారి యేసుని చిరునవ్వుతోనే
నవ కాంతి లోకాన ప్రభవించెగా        ||నేడే||

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
హ్యాప్పీ క్రిస్మస్ టు యు…
లోకాన శాంతి మురిసింది
మన మనస్సులో రాగాల కాంతి విరిసింది

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME