దీవించావే

పాట రచయిత: పి సతీష్ కుమార్, సునీల్
Lyricist: P Satish Kumar, Sunil

Telugu Lyrics

దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా..        ||దీవించావే||

నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని..       ||దీవించావే||

కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే..       ||దీవించావే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నాకున్నది నీవేనని

పాట రచయిత: పండు ప్రేమ్ కుమార్
Lyricist: Pandu Prem Kumar

Telugu Lyrics


నాకున్నది నీవేనని
నను కన్నది సిలువేనని (2)
నీవున్నది నాలోనని
నేనున్నది నీకేనని
సాక్ష్యమిచ్చెద యేసయ్యా
నీ సాక్షిగా బ్రతికించుమయ్యా       ||నాకున్నది||

గుడ్డివాడను నేనేనని
నీ చూపు ప్రసాదించేవని (2)
చెవిటి వాడను నేనేనని
నీ వినికిడి నేర్పించేవని         ||సాక్ష్యమిచ్చెద||

మూగవాడను నేనేనని
నీ మాటలు పలికించేవని (2)
అవిటివాడను నేనేనని
నీ నడకలు నేర్పించేవని         ||సాక్ష్యమిచ్చెద||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవా నీ సాక్షిగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా నీ సాక్షిగా నేనుండుట
ఈ మంటికి భాగ్యము (2)
జాలిగా మనుజాళికై
కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు
నా తుది శ్వాస ఆగే వరకు      ||దేవా||

నాలాంటి నర మాత్రుని చేరుట
నీ వంటి పరిశుద్ధునికేలనో (2)
ఏ మేధావికి విధితమే కాదిది
కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే
నా బ్రతుకంత కొనియాడుట      ||దేవా||

నా ఊహకందని మేలుతో
నా గుండె నిండింది ప్రేమతో (2)
నా కన్నీటిని మార్చి పన్నీరుగా
నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము
నేను ఎలుగెత్తి ప్రకటించెద      ||దేవా||

English Lyrics

Audio

శిరము మీద ముళ్ల సాక్షిగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ల సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా (2)
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు (3)

సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని (2)
మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
యేసులోనే నెరవేరెనుగా

సర్వ పాప పరిహారో
రక్త ప్రోక్షణం అవశ్యం
తద్ రక్తం పరమాత్మేనా
పుణ్య దాన బలియాగం

ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ        ||శిరము||

మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని (2)
కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా

చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
వృషభో రోర వీతి మహో దేవో
మద్యామ్ ఆవివేశత్తిథి

బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
యేసులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా       ||శిరము||

English Lyrics

Audio

సిలువ సాక్షిగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన           ||సిలువ||

యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో        ||సిలువ||

లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే
సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో           ||సిలువ||

English Lyrics

Audio

ప్రభువా కాచితివి

పాట రచయిత: క్రీస్తు దాస్
Lyricist: Kreesthu Das

Telugu Lyrics

ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)
నీ సాక్షిగా నే జీవింతునయ్యా         ||ప్రభువా||

కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2)
నన్ను వలచావులే – మరి పిలిచావులే (2)
అరచేతులలో నను చెక్కు కున్నావులే (2)       ||ప్రభువా||

నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)
పాపము కడిగావులే – విషము విరచావులే (2)
నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2)       ||ప్రభువా||

బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)
నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2)
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2)       ||ప్రభువా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిన్ను తలచి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నిన్ను తలచి నను నేను మరచి
నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)
యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2)     ||నిను తలచి||

జీవము లేని దైవారాధనలో
నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)
జీవాధిపతివై నా జీవితానికి
నిత్య జీవము నొసగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

దారే తెలియని కారు చీకటిలో
బ్రతుకే భారమై నలిగిపోతిని (2)
నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2)     ||నిను తలచి||

సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
హృదిలో నేను మురిసిపోతిని (2)
సుగుణాలు చూచుటకే నీవు
సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

English Lyrics

Audio

HOME