మా ఊహలు పుట్టక మునుపే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2)
ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)
విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2)
పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2)          ||మా ఊహలు||

నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)
పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2)
అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు        ||మా ఊహలు||

ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2)
ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2)
ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు         ||మా ఊహలు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

మహిమ నీకే ప్రభూ

పాట రచయిత: అంశుమతి దార్ల
Lyricist: Amshumathi Darla

Telugu Lyrics


మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ||

సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2)       ||ఆరాధనా||

ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2)       ||ఆరాధనా||

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2)       ||ఆరాధనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసే దైవము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే దైవము – యేసే జీవము
నా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2)
మహిమా నీకే ఘనతా నీకే
నిన్నే పూజించి నే ఆరాధింతును

యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా (3)       ||యేసే||

English Lyrics

Audio

నీవే నా ప్రాణము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీవే నా ప్రాణము నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా (2)
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం (3)        ||నీవే||

మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే (2)
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్ (2)             ||నీవే||

తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)
బ్రతుకంతా నీ కొరకై జీవింతును
నిను నేను ఆరాధింతున్ (2)             ||నీవే||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

 

HOME