ఆకాశము నీ సింహాసనం

పాట రచయిత: వై సత్యవర్ధన్ రావు
Lyricist: Y Sathyavardhan Rao

Telugu Lyrics


ఆకాశము నీ సింహాసనం
భూలోకము నీ పాద పీఠము
మహోన్నతుడా – మహా ఘనుడా
నీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము

స్తుతులకు పాత్రుడా యేసయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా
జీవాధిపతివి నీవయ్యా
జీవము గల మా యేసయ్యా

పాపుల రక్షకా యేసయ్యా
రక్షించుటకు పుట్టావయ్యా
నీ సిలువే నా మరణమును
తప్పించి రక్షించెనయ్యా

అద్భుతకారుడా మహనీయా
ఆశ్చర్యకరుడా ఓ ఘనుడా
దయగల మా ప్రభు యేసయ్యా
కృపగల మా ప్రభు నీవయ్యా

రానైయున్న యేసయ్యా
బూరధ్వనితో నీవేనయ్యా
మధ్యాకాశంలో విందయ్యా
ఎంతో ధన్యత మాకయ్యా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రభుకే స్తోత్రము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును
ఘన విజయమిచ్చును (2)

ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ
మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు
లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్
క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము
అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్
దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పాడెద దేవా నీ కృపలన్

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


పాడెద దేవా – నీ కృపలన్
నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)

భూమి పునాదులు వేయకముందే
యేసులో చేసితివి (2)
ప్రేమ పునాదులు వేసితివి
దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2)          ||పాడెద||

ప్రవిమల రక్తము కలువరి సిలువలో
కలునకు నిచ్చితివి (2)
ప్రేమ కృపా మహదైశ్వర్యములతో
పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2)          ||పాడెద||

పాపము శాపము నరకపు వేదన
మరి తొలగించితివి (2)
అపరాధములచే చచ్చిన నన్ను
ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2)          ||పాడెద||

దేవుని రాజ్యపు వారసుడనుగా
క్రీస్తులో చేసితివి (2)
చీకటి రాజ్యపు శక్తుల నుండి
నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2)          ||పాడెద||

ముద్రించితివి శుద్ధాత్మతో నను
భద్రము చేసితివి (2)
సత్యస్వరూప నిత్యనివాసి
సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2)          ||పాడెద||

అన్యుడనై నిను ఎరుగక యున్నను
ధన్యుని చేసితివి (2)
ప్రియ పట్టణ పౌరుల సేవింపను
వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2)          ||పాడెద||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తుతులకు పాత్రుడా (ఆరాధన)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము
త్వరలో రానున్న – మా మెస్సయ్యా
మరణము గెలచిన మా విమోచకుడా
ఆరాధన చేసెదం
అజేయుడా మా ప్రభూ
అద్వితీయ సత్య దేవుడా
నీవే మా రాజువు (2)            ||స్తుతులకు||

నీతియు సమాధానము
ఆనందము నీ రాజ్యము
నీ సిలువయే మాకు శక్తి
నీ సిలువయే మాకు బలము (2)
ఆత్మానుసారమైన
నవీన జీవితమునిచ్చితివి
ఆత్మ నియమము ద్వారా
పాప మరణము నుండి విడిపించితివి (2)            ||ఆరాధన||

నీవే మా నిరీక్షణకర్తవు
నమ్మదగినవాడవు
నీలోనే మా అతిశయము
మమ్ము విలువ పెట్టి కొన్నావు (2)
ప్రభువా మీతో మేము
ఏకాత్మయై యున్నాము
అక్షయమగు కిరీటము
ధరియింపజేయువాడవు నీవే (2)            ||ఆరాధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇన్నాళ్లు తోడుగా

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)

ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా (2)
ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)      ||ఇశ్రాయేలు||

మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2)      ||ఇశ్రాయేలు||

English Lyrics

Audio

స్తుతి మధుర గీతము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద      ||స్తుతి||

కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2)
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా        ||స్తుతి||

అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2)
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి        ||స్తుతి||

English Lyrics

Audio

సంవత్సరములు వెలుచుండగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2)    ||సంవత్సరములు||

గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)
శత్రువల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు (2)     ||నీకే||

బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు
పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)
నూతన క్రియలతో నను నింపినావు
సరి కొత్త తైలముతో నను అంటినావు (2)     ||నీకే||

English Lyrics

Audio

జీవమా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


జీవమా… యేసయ్యా…
ఆత్మతో నింపుమా – అభిషేకించుమా
స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3)
స్తోత్రము యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)      ||జీవమా||

మేడ గది మీద అపోస్తులపై
కుమ్మరించినాత్మ వలె
పరిశుద్ధాగ్ని జ్వాల వలె
నీ ప్రేమను కుమ్మరించుము (2)       ||స్తోత్రము||

అనుదినం నీ దివ్య సేవలో
అభిషేకం దయచేయుమా
పలు దిశల సువార్త ప్రకటింప
నీ ఆత్మను కుమ్మరించుము (2)       ||స్తోత్రము||

English Lyrics

Audio

నా ప్రియమైన యేసు ప్రభు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు         ||నా ప్రియమైన||

ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2)        ||నా ప్రియమైన||

ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2)        ||నా ప్రియమైన||

లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2)
శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2)        ||నా ప్రియమైన||

ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2)
ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2)        ||నా ప్రియమైన||

మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2)
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2)        ||నా ప్రియమైన||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

నా ప్రాణమా ఏలనే

పాట రచయిత: ఆర్ మధు
Lyricist: R Madhu

Telugu Lyrics


నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా
సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా
ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2)
నెమరేసుకుంటూ ప్రాణమా
స్తుతిపాడుమా – స్తుతిపాడుమా        ||నా ప్రాణమా||

నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు
నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2)
నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా
నీవు కూడా తన కార్యం పాటించుమా (2)
అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా
మరువకు సుమా – మరువకు సుమా        ||నా ప్రాణమా||

నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు
నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2)
నా ప్రాణమా నాలో కరిగిపోకే
నీ గతం ఏమిటో మరచిపోకే (2)
దినమెల్ల దేవుని దయ కోరుమా
దయ కోరుమా – దయ కోరుమా        ||నా ప్రాణమా||

నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు
నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2)
నా ప్రాణమా నాలో కృంగిపోకే
నీ గతం ఏమిటో మరచిపోకే (2)
దినమెల్ల దేవుని కృప కోరుమా
కృప కోరుమా – కృప కోరుమా         ||నా ప్రాణమా||

English Lyrics

Audio

HOME