ఆహా ఆనందమే పరమానందమే

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా       ||ఆహా||

నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే (2)
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను (2)       ||ఆహా||

నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ (2)
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి (2)       ||ఆహా||

నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని (2)
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2)       ||ఆహా||

మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో (2)
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే (2)       ||ఆహా||

English Lyrics

Audio

కలువరి గిరి సిలువలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2)         ||కలువరి||

కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – (2)         ||కలువరి||

జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – (2)         ||కలువరి||

English Lyrics

Audio

నీ కృప నిత్యముండును

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప||

శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప||

ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప||

అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)        ||నీ కృప||

English Lyrics

Audio

నా హృదయములో

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు (2)
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2)        ||నా హృదయములో||

మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు         ||నీ కార్యములను||

విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు         ||నీ కార్యములను||

పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు         ||నీ కార్యములను||

English Lyrics

Audio

HOME