నోవహు ఓడనే సంఘములో

పాట రచయిత:ఇశ్రాయేల్
Lyricist: Israel

నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు
నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2)
మాట వినిన పావురం – లోబడని కాకియు
ఆ సంఘములో విశ్వాసులైనాయి (2)     ||నోవహు ఓడనే||

గురుతు తెమ్మని నోవహు పంపాడు… తెలివైన కాకిని
దైవ జనుని మాటే మరచి… లోకమును ప్రేమించి… (2)
ఇటు అటు తిరుగుచుండెనా కాకి (2)
సంఘములో ఉన్న నీవు… పాపముపై ఆశతో (2)
ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా (2)
నీవు కాకివా… పావురానివా (2)     ||నోవహు ఓడనే||

గురుతు తెమ్మని నోవహు పంపాడు… నల్లని పావురమును
ఓడను మరచి పోక… కాలు నిలుప స్థలము లేక…
మరల తిరిగి వచ్చే ఆ పావురము (2)
సంఘములో ఉన్న నీవు… పరిశుద్ధత కాంక్షతో (2)
లోకమునకు వేరుగ ఉన్న భక్తి పావురానివా (2)
పావురానివా… నీవు కాకివా (2)     ||నోవహు ఓడనే||

గురుతు తెమ్మని నోవహు పంపాడు… మరలా ఆ పావురమును
ఆజ్ఞను మరచి పోక… ఒలీవాకు గురుతుగా తెచ్చె…
బాధ్యత కలిగిన ఆ పావురము (2)
సంఘములో ఉన్న నీవు… ఆత్మల భారముతో (2)
ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా (2)
పావురానివా… నీవు కాకివా (2)

నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు
నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2)
మాట వినిన పావురం – లోబడని కాకియు
ఆ సంఘములో విశ్వాసులైనాయి (2)
నీవు కాకివా… పావురానివా (4)

Download Lyrics as: PPT

సువార్తే పరిష్కారం

పాట రచయిత: సురేష్ వంగూరి
Lyricist: Suresh Vanguri

అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం

సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా

ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం

జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె          ||ఇకనైనా||

అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు          ||ఇకనైనా||

జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు
సంధిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం          ||ఇకనైనా||

సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై
చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా…

బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేరా          ||ఇకనైనా||

Download Lyrics as: PPT

ఈ ఉదయమున

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2)     ||ఈ ఉదయమున||

తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం (2)
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము      ||ఈ ఉదయమున||

అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు కాగా (2)
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా

ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

షారోను పొలములో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


షారోను పొలములో పూసిన పుష్పమా
అగాధ లోయలో దాగిన పద్మమా (2)
ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2)     ||షారోను||

ఆనందభరితం నీ హృదయం
నీ ప్రేమ అపారము (2)
యేసు నాథుడు నిన్ను పిలువగా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా – (2)     ||షారోను||

కొండలు దాటి బండలు దాటి
యేసు నాథుడు నిను చేరగా (2)
నీదు హృదయమున నివసింపనీయుమా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా – (2)     ||షారోను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కరుణించి తిరిగి సమకూర్చు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2)
క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2)

దావీదు రాజు దీనుడై వేడ (2)
అవనిలో బొందిన నష్టములన్నియు (2)
దేవా నీవు సమకూర్చితివే (2)      ||కరుణించి||

శత్రు సమూహపు కుతంత్రములతో (2)
బొత్తిగా నేను నష్టపడితిని (2)
మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2)      ||కరుణించి||

పసరు గొంగళి – చీడ పురుగులు (2)
నాశనము చేసిన పంటను కూర్చుమా (2)
యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2)      ||కరుణించి||

ప్రేమ సంతోషానందములను (2)
ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2)
ప్రేమతో నీవు సమకూర్చుమా (2)      ||కరుణించి||

పాపపు విషముతో నా పాత్ర నిండెను (2)
ప్రభు యేసుండను పిండిని కలుపుము (2)
పాప మరణమును తొలగించుమా (2)      ||కరుణించి||

ఆత్మీయ సోమరితనములో నుండి (2)
ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2)
ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2)      ||కరుణించి||

పాపము చేసి పడియున్న చోటున్ (2)
ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2)
కోపగించక నాపై కృప జూపుమా (2)      ||కరుణించి||

చేసిన పాపము కప్పుకొనక (2)
విశ్వాసముతో ఒప్పుకొందున్ (2)
సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2)      ||కరుణించి||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

కానరావే అలనాటి కన్నీటి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు
కదలవేమి అపవాది చెరసాల పునాదులు
ఇది నీ లోపమా – మరి నా లోపమా
యోచించుమా క్రీస్తు సంఘమా (2)
యోచించుమా క్రీస్తు సంఘమా       ||కానరావే||

సమూయేలుల నందించే హన్నాలేరి
సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2)
నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2)
నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో
కాలేబులెటు పోయిరో            ||ఇది నీ లోపమా||

అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి
ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2)
శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి (2)
శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో
దావీదులెటు పోయిరో           ||ఇది నీ లోపమా||

నిద్ర లేవాలి ఓ సంఘమా
అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా
క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా
ఉజ్జీవం నీలో నిండాలి
ఓ సంఘమా… నిజ సంఘమా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

శ్రమయైనా బాధైనా

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics


శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2)
సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు

ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు?
శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు

అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు

విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును
విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను

ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు        ||శ్రమయైనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

న్యాయాధిపతి అయిన దేవుడు

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

న్యాయాధిపతి అయిన దేవుడు
నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీవుందువో
యోచించుకో ఓ మానవా (2)      ||న్యాయాధిపతి||

ఆకలితో అలమటించగా
దాహముతో తపియించగా (2)
రోగముతో కృశియించగా (2)
నను చేర్చుకొనలేదు నీవెందుకు
అని యేసు నిన్నడిగిన ఏమందువు (2)      ||న్యాయాధిపతి||

గ్రహియించుకో నీదు గమ్యము
విడనాడు పాప గతమును (2)
లేదింక నీకు తరుణము (2)
ప్రభునాశ్రయించుటే బహు క్షేమము
ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2)      ||న్యాయాధిపతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అన్యజనులేల

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

అన్యజనులేల లేచి
గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల
జనములేల వ్యర్థమైన
దాని తలంచుచున్నవి (2)           ||అన్యజనులేల||

భూలోక రాజులు లేచి
వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు
వారి పాశములను తెంపి
పారవేయుద మనుచున్నారు (2)           ||అన్యజనులేల||

ఆకాశ వాసుండు వారిని
అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు
వారలతో పల్కి కోపముతో
వారిని తల్లడిల్ల చేయును (2)           ||అన్యజనులేల||

పరిశుద్ధమైన నాదు
పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన
నారాజు నాసీనునిగా జేసి
యున్నానని సెలవిచ్చెను (2)           ||అన్యజనులేల||

కట్టడ వివరింతు నాకు
యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు
నీవు నా కుమారుడవు
నిన్ను నేను కనియున్నాను (2)           ||అన్యజనులేల||

నన్ను అడుగుము నీకు
జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము
దిగంతముల వరకు
స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2)           ||అన్యజనులేల||

ఇనుప దండముతో నీవు
వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో
కుండను పగులగొట్టునట్లు
వారిని పగులగొట్టెదవు (2)           ||అన్యజనులేల||

ఓ రాజులారా మీరు
జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా
ఓ భూపతులారా మీరు
నాభోద నొందుడి నేడే (2)           ||అన్యజనులేల||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దుష్టుల ఆలోచన చొప్పున

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


దుష్టుల ఆలోచన చొప్పున నడువక (2)
పాపుల మార్గములయందు నిలిచి యుండక (2)

అపాహసించునట్టి ప్రజలు కూర్చుండెడు (2)
ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు (2)

యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు (2)
ఎల్లప్పుడు ధ్యానము చేయువాడే ధన్యుడు (2)

కాలువ నీటి యోర నతడు నాటబడి తన (2)
కాలమున ఫలించు చెట్టు వలె యుండును (2)

ఆకు వాడని చెట్టువలె నాతడుండును (2)
ఆయన చేయునదియెల్ల సఫలమగును (2)

దుష్ట జనులు ఆ విధముగా నుండక (2)
పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు (2)

న్యాయ విమర్శ సభలయందు దుష్ట జనులు (2)
నీతిమంతుల సభలో పాపులును నిలువరు (2)

నీతిమంతుల మార్గము యెహోవ ఎరుగును (2)
నడుపును దుష్టుల దారి నాశనమునకు (2)          ||దుష్టుల||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME