ఓడిపోనివ్వడు

పాట రచయిత: జార్జ్ బుష్
Lyricist: George Bush

Telugu Lyrics

ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు

ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2)      ||ఓడిపోనివ్వడు||

పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2)        ||ఓడిపోనివ్వడు||

నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసలుగా చేసి అమ్మారుగా
యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)

దాటిపోడెన్నడు – దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు (2)        ||ఓడిపోనివ్వడు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆనందింతుము

పాట రచయిత: జాషువా అరసవెల్లి
Lyricist: Joshua Arasavelli

Telugu Lyrics

ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2)
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం (2)
యేసుని సన్నిధిలో ఆనందింతుము (2)      ||ఆనందింతుము||

భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా (2)
హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2)
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2)      ||ఆనందింతుము||

నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2)
పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2)
యేసుని సన్నిధిలో పరవశించెదం (2)      ||ఆనందింతుము||

ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2)
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2)
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2)      ||ఆనందింతుము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆకాశ పక్షులను చూడండి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు అవి కోయవు
గరిసెలలో దాచుకోవూ
కొట్లలో కూర్చుకోవు          ||ఆకాశ||

అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి          ||ఆకాశ||

స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు          ||ఆకాశ||

పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ          ||ఆకాశ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఏ తెగులు నీ గుడారము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)

ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2)       ||ఏ తెగులు||

గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2)       ||ఏ తెగులు||

మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2)       ||ఏ తెగులు||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఎల్లప్పుడును ప్రభువునందు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి
ప్రతి సమయములోను…
ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)
యెహోవా చేసిన మేలుల కొరకై
ఎల్లప్పుడును ఆనందించండి (2)
ఆరాధించండి          ||ఎల్లప్పుడును||

పాపంబు తోడ చింతించుచుండ
నరునిగా ఈ భువిలో ఉదయించెగా
మన పాప భారం తన భుజమున మోసి
మనకై తన ప్రాణం అర్పించెగా (2)
ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే     ||ఎల్లప్పుడును||

విశ్వాసమునకు కలిగే పరీక్ష
ఓర్పును కలిగించే ఒక సాధనమై
శోధనకు నిలిచి సహించిన వేళ
జీవ కిరీటమును పొందెదము (2)
నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి
సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి     ||ఎల్లప్పుడును||

ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి
మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి
మనతో నివాసమును కలిగి యుండుటకు
త్వరలోనే రారాజుగా రానైయుండె (2)
శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి
సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి      ||ఎల్లప్పుడును||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

యేసే నీ మదిలో ఉండగా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


యేసే నీ మదిలో ఉండగా
కలతే దరి చేరగ రాదుగా (2)
సోదరా సోదరీ.. యేసులో నెమ్మది
ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది      ||యేసే||

తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా
ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2)
నీ చెంతకు చేరి నిలుపును
నీ చింతను తీర్చి నడుపును (2)
సోదరా సోదరీ.. యేసే నీ మాదిరి
సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2)       ||యేసే||

సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగా
సహింపలేని శోధనలను నీకు దయచేయునా (2)
శోధనలను గెలిచే మార్గము
తప్పక నీకొసగును తథ్యము (2)
సోదరా సోదరీ.. యేసులో విజయము
సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం (2)       ||యేసే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అమూల్యమైన ఆణిముత్యమా

పాట రచయిత: రేచెల్ జ్యోతి కొమానపల్లి
Lyricist: Rachel Jyothi Komanapalli

Telugu Lyrics

అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా (2)
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు (2)        ||అమూల్యమైన||

జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు (2)
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు (2)        ||అమూల్యమైన||

చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు (2)
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు (2)        ||అమూల్యమైన||

దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు (2)
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు (2)        ||అమూల్యమైన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నమ్మకు ఇలలో

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics


నమ్మకు ఇలలో ఎవరిని
సాయం చేస్తారనుకొని (2)
నమ్ముకో రక్షకుడేసుని (2)
కార్యం చూడు నిలుచొని (2)        ||నమ్మకు||

సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు
చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు
అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2)
శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2)        ||నమ్మకు||

నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే
మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే
నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2)
దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2)        ||నమ్మకు||

నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి
జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి
సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2)
రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2)        ||నమ్మకు||

English Lyrics

Audio

ఓ నావికా

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

ఓ నావికా.. ఓ నావికా..
ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా..

ఓ నావికా…. ఓ నావికా….
శ్రమలలో శ్రామికా… (2)
ఊసు వింటివా వింత గంటివా
యేసు సామి ఊసు నీవు వింటివా (2)
హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సా (2)

వలేసావు రాతిరంతా
ధార పోసావు కష్టమంతా (2)
చిక్కలేదు చేప ఒక్కటైనా
దక్కలేదు ఫలము కొంతైనా (2)
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2)
నింపాడు నీ నావ అద్భుత రీతితో
తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో (2)
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి (2)
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి (2)         ||ఓ నావికా||

విరిగి నలిగిన మనస్సుతో
చేసావు నీ సమరం (2)
శయనించక ఎడతెగక
ఈదావు ఈ భవ సాగరం (2)
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2)
కరుణించాడు నిన్ను చల్లని చూపుతో
నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో (2)
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి (2)
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి (2)         ||ఓ నావికా||

English Lyrics

Audio

ఓ ఇశ్రాయేలు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2)      ||ఓ ఇశ్రాయేలు||

భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్ (2)
అత్యధికముగా చేతునని (2)
యెహోవా దేవుడే పల్కెన్ (2)      ||ఓ ఇశ్రాయేలు||

సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము (2)
తొలగిపోదు ఎన్నడూ (2)
లయము కాదు ఎన్నడూ (2)      ||ఓ ఇశ్రాయేలు||

నీవు భయపడకుము
బాధించువారు రాకుండను (2)
దూరముగా నుంచి యున్నాను (2)
నీకు తోడైయున్నాను (2)      ||ఓ ఇశ్రాయేలు||

English Lyrics

Audio

HOME