లివింగ్ హోప్ (తెలుగు)

పాట రచయిత: ఫిల్ విక్ఖమ్
అనువదించినది: పాల్ & సౌభాగ్య
Lyricist: Phil Wickham
Translators: Paul & Sowbhagya

Telugu Lyrics

మన మధ్యన దూరం ఎంతో ఎత్తైనది
మేమెక్కలేనంత ఎత్తైన పర్వతం
నిరాశలో మేము నీ వైపు చూచి
నీ నామములో విడుదలను ప్రకటించితిమి
అంధకారము తొలగించి
మా ఆత్మను రక్షించి
నీ ప్రేమతో మమ్ము నింపినావయ్యా
పరిపూర్ణమైనది నీవు రచియించిన అంతం
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ

ఊహలకు అందనిది నీ కరుణ కటాక్షం
మాపై కురిపించితివి సమృద్ధిగను
యుగయుగములకు రాజా నీ మహిమను విడచి
మా శాప భారము నీవే భరియించితివి
నీ సిలువలో మేము పొందితిమి క్షమాపణ
మేము నీవారిగా మార్చబడితిమి
సుందరుడా యేసయ్యా మేము నీ వారము
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ

హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్
హల్లెలూయా నీవు మరణము గెలిచితివి
నీ నామంలో రక్షణను
మాకు విజయమునిచ్చితివి
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2)

నీవు లేచిన ఉదయాన నెరవేరెను వాగ్ధానం
నిర్జీవ శరీరం శ్వాసించెనుగా
నిశ్శబ్దములో నుండి నీవు పలికిన జయభేరి
“ఓ మరణమా నీ జయమెక్కడ?” (2)
యేషువా నీకే జయమెప్పుడు

హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్
హల్లెలూయా నీవు మరణము గెలిచితివి
నీ నామంలో రక్షణను
మాకు విజయమునిచ్చితివి
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2)
యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ – (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవే నా ఆశ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎక్కలేనంత ఎత్తైన కొండ
ఎక్కించు వారు లేరెవ్వరు
కొండల తట్టు నా కన్నులెత్తి
నిరాశలో నిన్నే పిలిచాను
చీకటి తొలగించి నీ ప్రేమతోనే
నా హృదయమును నింపావు
లేఖనాలన్ని నెరవేర్చినావు
యేసు రాజా నీవే నా ఆశ

ఊహించలేని నీ గొప్ప కృపను
సమృద్ధిగానే పొందితిని
యుగముల రాజా మహిమను వీడి
అవమానమునే భరియించావు
సిలువలో నేను క్షమనే పొందాను
నీ సొత్తుగా నన్నే మార్చావు
నా రక్షకా నీ వాడను నేను
యేసు రాజా నీవే నా ఆశ

హల్లెలూయా నిన్నే ఆరాధింతును
హల్లెలూయా మరణమునే గెలిచావు
బంధకాలను తెంచావు
నీ నామములో రక్షణ
యేసు రాజా నీవే నా ఆశ (2)

వచ్చింది ఉదయం నెరవేరే వాగ్ధానం
సమాధిలో దేహం ఊపిరి పీల్చెన్
మరణముకు నాపై అధికారం లేదని
మౌనమునే వీడి చాటించావు (2)
యేసు.. నీదే విజయము

హల్లెలూయా నిన్నే ఆరాధింతును
హల్లెలూయా మరణమునే గెలిచావు
బంధకాలను తెంచావు
నీ నామములో రక్షణ
యేసు రాజా నీవే నా ఆశ (2)

యేసు రాజా నీవే నా ఆశ
దేవా నీవే నా ఆశ

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవుడొక నగరము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


దేవుడొక నగరము మన కొరకై
సిద్ధపరచుచుండె నుండుటకై (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా (2)        ||దేవుడొక||

మేలిమి బంగారము అద్భుత నగరం
విలువైన రాళ్ళతో పునాది వేసెను (2)
రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

నగర ప్రాకారములు ఎత్తైనవి
సూర్య కాంతములచే కట్టబడెను (2)
ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు
పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2)
పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

ఆ నగర వీధులు మేలిమి బంగారం
ద్వారములు ఎప్పటికి మూయబడవు (2)
ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును
ఆయనే దీపము నాలయమై యుండును (2)
జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

జయవంతుల కొరకే ఆ నగరం
పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2)
విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా ప్రియ యేసు రా

పాట రచయిత: ప్రణీత్ పాల్
Lyricist: Pranith Paul

Telugu Lyrics


ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2)
నాకు మాత్రము నీవే చాలయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా
రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..
రా.. నా ప్రియ యేసు రా – (2)

ఆశీర్వాదములు కావయ్యా
అభిషేకము కొరకు కాదయ్యా (2)
నీవే నా ఆశీర్వదమయ్యా
నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా… ఓ..
రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ..
రా.. నా ప్రియ యేసు రా – (2)

నీకై నేను – నాకై నీవు
ఉంటే చాలయ్యా – అదియే నా ఆశ దేవా ..
నాలో ఉన్నవాడా – నాతో ఉన్నవాడా
నీవుంటే చాలయ్యా – రావా నాకై
నా ప్రాణం నీవయ్యా – నా ప్రేమ నీకేయ్యా
నీవే నా ఊపిరి యేసయ్యా
నీ పాదాలపై అత్తరునై నేనుంటా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా

పరలోకము కొరకు కాదయ్యా
వరముల కొరకు కాదయ్యా
ప్రవచనముల కొరకు కాదయ్యా
నీవుంటే నాకు చాలయ్యా
నీ శ్వాసే పరలోకం దేవా
నిను పోలిన వరములు ఏవి లేవయ్యా
ఎన్నెన్ని వరములు నాకున్నా
నీవు లేని జీవితమే వ్యర్ధముగా
నీ కోసమే బ్రతికెదను యేసయ్యా
నీ కోసమే చావైనా మేలేగా

నీ..కై ఎవరు రాకున్నా హో…
నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ..
నీ హతసాక్షిగ నే చస్తా
రా.. నా ప్రియా యేసు రా…

నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే
కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు
నీకై నే వేచి ఉన్నా రావా నాకై…
నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని
నీవే నా ఊపిరి యేసయ్యా
నీ గుండె లోతున ఆలోచన నేనేగా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో…

నాకు మాత్రము నీవే చాలయ్యా – (4)
వీడని ప్రియుడవు రావా నాకై
నిన్ను పోలి ఉంటా నే రావా నాకై
వేచియున్నా నీ కోసం రావా నాకై
ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై
రావా… దేవా… రావా… దేవా…
నాకు మాత్రము నీవే చాలయ్యా
నా కోసము రావా యేసయ్యా… త్వరగా…

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవా నా మొరాలకించితివి

పాట రచయిత: యెండ్లూరి జడ్సన్ స్టాన్లీ జోన్స్
Lyricist: Yendluri Judson Stanley Jones

Telugu Lyrics


దేవా నా మొరాలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము      ||దేవా||

కనికరించి నా మొరను – ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2)
స్తోత్రము చేయుదు హల్లెలూయని
నా జీవిత కాలమంతా (2)
నా జీవిత కాలమంతా…
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…      ||దేవా||

కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2)
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా (2)
కీర్తింతునో ప్రభువా….
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…      ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మహోన్నతమైన సీయోనులోన

పాట రచయిత: జ్ఞానయ్య
Lyricist: Gnaanaiah

Telugu Lyrics


మహోన్నతమైన సీయోనులోన సదా కాలము
నా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ (2)
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నాకు కావాలయ్యా..
యేసయ్యా నాకు కావాలయ్యా (2)
ఆరాధనా ఆరాధనా (2)
ఆరాధనా ఆరాధనా (2)         ||మహోన్నతమైన||

లోకమంతయు నష్టముగా ఎంచి
సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను (2)
బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా (2)
ఘనపరతును నా దేవుని
స్తుతియింతును నా దేవుని – (2)       ||విరిగిన||

మహా మహిమతో నీవొచ్చు సమయమున
కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను (2)
హింస మూలమునైనా – కరువు మూలమునైనా (2)
సంతోషింతును నా యేసుతో
ప్రకాశింతును ఆ మహిమలో – (2)       ||విరిగిన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రీస్తేసు ప్రభువు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి
కొన్నట్టి సంఘమున
ఎవరు చేరెదరో వారే ధన్యులు
పరలోకము వారిది (2)      ||క్రీస్తేసు||

అపొస్తలుల బోధను నమ్మి
స్థిరపరచబడిన వారే (2)
ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు
సంఘములో నిలిచెదరు (2)      ||క్రీస్తేసు||

పరిశుద్ధులతో సహవాసమును
ఎవరు కలిగియుందురో (2)
వారే పొందెదరు క్షేమాభివృద్ధి
క్రీస్తేసు ప్రభువు నందు (2)      ||క్రీస్తేసు||

ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే
తన యందు నిలిచెదరు (2)
ప్రకటించెదరు ఆయన మరణ
పునరుత్తానమును వారు (2)      ||క్రీస్తేసు||

పట్టు వదలక సంఘముతో కూడి
ఎవరు ప్రార్ధించెదరో (2)
ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు
బంధించెదరు వారే (2)      ||క్రీస్తేసు||

క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు
ఎవరెదురు చూచెదరో (2)
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు
సర్వ లోకము నందు (2)      ||క్రీస్తేసు||

English Lyrics

Audio

Audio

Download Lyrics as: PPT

ఏగెదను నే చేరెదను

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

ఏగెదను నే చేరెదను
సీయోనును నే చూచెదను (2)
విశ్వాస కర్తయైన నా యేసూ (2)
నీ సముఖములో నే మురిసెదను
నీ కౌగిలిలో ఉప్పొంగెదను (2)
జీవ కిరీటమును నే పొందెదను      ||ఏగెదను||

భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను
యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును (2)
దినదినము నాలో నే చనిపోవుచున్నాను
అనుదినము నీలో బ్రతుకుచున్నాను (2)
అనుదినము నీలో బ్రతుకుచున్నాను      ||ఏగెదను||

నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము
సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను (2)
మంచి పోరాటముతో నా పరుగును
కడముట్టించి జయమొందెదను (2)
విశ్వాసములో జయమొందెదను      ||ఏగెదను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా దేవ ప్రభువా

పాట రచయిత: శారా ఫ్లవర్ ఆడమ్స్
అనువదించినది: బర్నార్డ్ లూకాస్
Lyricist: Sara Flower Adams
Translator: Bernard Lucas

Telugu Lyrics


నా దేవ ప్రభువా నీ చెంతను
సదా వసింపను నా కిష్టము
ఏవైనా శ్రమలు తటస్థమైనను
నీ చెంత నుందును నా ప్రభువా

ప్రయాణకుండను నడవిలో
నా త్రోవ జీకటి కమ్మినను
నిద్రించుచుండగా స్వప్నంబునందున
నీ చెంత నుందును నా ప్రభువా

యాకోబు రీతిగా ఆ మెట్లను
స్వర్గంబు జేరను జూడనిమ్ము
నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా
నీ చెంత నుందును నా ప్రభువా

నే నిద్రలేవగా నా తండ్రి నే
నీకుం గృతజ్ఞత జెల్లింతును
నే చావునొందగా ఇదే నా కోరిక
నీ చెంత నుందును నా ప్రభువా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీతి సూర్యుడవై

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2)
నీదు రక్షణతో మమ్ము కాచినందుకు
నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2)
నీకే వందనం – నీకే వందనం
నీకే వందనం – యేసు రాజ వందనం (2)     ||నీతి||

త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా
నీదు విందులోన చేరాలని మా దేవా (2)
సిద్ధపాటుకై కృపలను చూపుమని
నిన్నే వేడితిమి నీవే మా బలమని (2)    ||నీకే||

నీ నామము రుచిని ఎరిగిన వారము మేము
నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2)
నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు
నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2)    ||నీకే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME