ఇదియేనయ్య మా ప్రార్థన

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా (2)

నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
మర్మాలను మాకు నేర్పించయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
లోబడని మా మనసులు సరిచేయయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆశీర్వాదంబుల్ మా మీద

పాట రచయిత: డేనియల్ డబ్ల్యూ విట్టల్
Lyricist: Daniel W Whittle

Telugu Lyrics

ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము

ఇమ్మాహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా

ఓ దేవా పంపింపవయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్      || ఇమ్మాహి ||

మా మీద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద
క్షామంబు పోనట్లుగన్        || ఇమ్మాహి ||

ఈనాడే వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి బ్రౌర్ధింతుము     || ఇమ్మాహి ||

English Lyrics

Audio

Chords

దేవా నీ గొప్పకార్యములన్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం
నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం
హల్లెలూయా నా యేసురాజ
హల్లెలూయా నా ప్రాణనాథ (2)
స్తుతులు మహిమ ఘనత నీకే (2)      ||దేవా నీ||

శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
పరమును వీడి భువికరుదెంచి
కలువరి సిలువలో రక్తము కార్చి
నీదు కృపతో నను రక్షించిన
నీ దివ్య ప్రేమను అత్యధికముగా
స్మరింతున్ జీవిత కాలమంతా          ||దేవా నీ||

నీ కంటిపాపగా నన్ను కాచి
నీ చేతి నీడలో నన్ను దాచి
నీ అరచేతిలో నను చెక్కుకొని
నీదు సొత్తుగా నను చేసుకొని
అక్షయమైన నీ మధుర ప్రేమను
దీక్షతో ఇలలో చాటెదను                 ||దేవా నీ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నన్నెంతగానో ప్రేమించిన

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)
నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2)
నా యవ్వనమంతా… నా జీవితమంతా (2)     ||నన్నెంతగానో||

ధరలోని మన్నుతో సమమైన నన్ను
ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)
అన్నీ నీవే నాకై సమకూర్చినావు
ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)
వాక్యపు మన్నాతో పోషించిన నన్నే
ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే    ||నిన్నే||

దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు
ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)
మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు
చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2)
పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో
మరణపు విల్లును విరచిన దేవా నీలో      ||నీలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇంత కాలం

పాట రచయిత: శుభనాథ్ తాడి
Lyricist: Shubhanath Thaadi

Telugu Lyrics

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)         ||ఇంత కాలం||

ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)         ||ఇంత కాలం||

నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)           ||ఇంత కాలం||

దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)           ||ఇంత కాలం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

అత్యున్నత సింహాసనముపై

పాట రచయిత: అంశుమతి మేరి
Lyricist: Amshumathi Mary

Telugu Lyrics

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2)            ||ఆహాహా||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (2)                    ||ఆహాహా||

స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2)     ||ఆహాహా||

మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2)             ||ఆహాహా||

ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2)                 ||ఆహాహా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

నా జీవం నా సర్వం

పాట రచయిత: కృపల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


నా జీవం నా సర్వం నీవే దేవా (2)
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా      ||నా జీవం||

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2)
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2)    ||నా జీవం||

నీవే నీవే నీవే దేవా (4)

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME