బంధము నీవే

పాట రచయిత: ఆడమ్ బెన్ని
Lyricist: Adam Benny

బంధము నీవే – స్నేహము నీవే (2)
(యేసయ్యా) అతిథివి నీవేనయ్యా
ఆప్తుడా నీవేనయ్యా (2)

ప్రేమించువాడా కృప చూపువాడా
నాతోనే ఉండి నను నడుపువాడా (2)
కాలాలు మారినా మారని వాడా (2)
విడువవు నను ఎప్పుడూ
మరువని తండ్రివయ్యా (2)          ||బంధము||

మూగబోయిన నా గొంతులోన
గానము నీవై నను చేరినావా (2)
హృదయ వీనవై మధుర గానమై (2)
నాలోనే ఉన్నావయ్యా
నా ఊపిరి నీవేనయ్యా (2)          ||బంధము||

ఈ లోకములో యాత్రికుడను
ఎవ్వరు లేని ఒంటరినయ్యా (2)
నీవే నాకు సర్వము దేవా (2)
చాలును చాలునయ్యా
నీ సన్నిధి చాలునయ్యా (2)          ||బంధము||

Download Lyrics as: PPT

వాటి వాటి కాలమున

పాట రచయిత: ఎస్ జే బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

Telugu Lyrics


వాటి వాటి కాలమున అన్నిటిని
అతి మనోహరముగా చేయువాడా (2)
యేసయ్యా.. యేసయ్యా..
నా దైవం నీవేనయ్యా (2)       ||వాటి వాటి||

ఆశ భంగం కానేరదు
మంచి రోజు ముందున్నది (2)
సత్క్రియను ఆరంభించెను
ఎటులైన చేసి ముగించును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
ఎటులైన చేసి ముగించును (2)      ||యేసయ్యా||

అద్భుతములు చేసెదను
నీ తోడుంటానంటివి (2)
నా ప్రజల ఎదుట నీవు
(నను) హెచ్చింప చేసెదవు (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
హెచ్చింప చేసెదవు (2)      ||యేసయ్యా||

ఇప్పుడున్న వాటి కంటే
వెయ్యి రెట్లు చేసెదవు (2)
ఆకాశ తార వలె
భువిలో ప్రకాశింతును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
భువిలో ప్రకాశింతును (2)      ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆధారం నీవేనయ్యా (మెడ్లి)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఆధారం నీవేనయ్యా
నాకు ఆధారం నీవేనయ్యా (2)
కాలము మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా (2) నా దేవా          ||ఆధారం||

నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ (2)
నీ దరికి చేరి నను నీకర్పించి
సాక్షిగ జీవింతును (2)            ||ఆధారం||

నీ రాయబారినై నేను
ధైర్యంగా జీవించ ఆశ (2)
నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ
నిను నేను ప్రకటింతును (2)            ||ఆధారం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

నా బలమంతా నీవేనయ్యా

పాట రచయిత: సామి తంగయ్య, కిరణ్ ఎజెకియెల్
అనువదించినది: క్రిస్టోఫర్ చాలూర్కర్
Lyricist: Sammy Thangaiah, Kiran Ezekial
Translator: Christopher Chalurkar

Telugu Lyrics


నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా (2)

అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2)
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా (2)       ||నా బలమంతా||

సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2)
(నన్ను) ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే (2)       ||నా బలమంతా||

జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా (3)       ||నా బలమంతా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

జీవాధిపతివి నీవే

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

జీవాధిపతివి నీవే నా యేసయ్య
నాకున్న ఆధారము నీవేనయ్యా (2)
నీవుంటే చాలు, కీడు కాదా! మేలు
లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2)    ||జీవాధిపతివి||

ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు
అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2)
నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము
నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2)     ||నీవుంటే||

రాజుల హృదయాలను తిప్పువాడవు
నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు (2)
ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను
నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా (2)    ||నీవుంటే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఒంటరితనములో తోడువై

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఒంటరితనములో తోడువై
నాతో నడచిన నా స్నేహమై
ఎడారిలో మార్గమై
చీకటి బ్రతుకులో వెలుగువై
మరువగలనా నీ ప్రేమ నేను
విడువగలనా నీ తోడు నేను
లోకముతోనే ఆనందించిననూ
నీ ప్రేమతో నను మార్చినావు
నా యేసయ్యా.. నా రక్షకా
నను కాచిన వాడా నీవేనయ్యా (2)

ఓటమిలో నా విజయమై
కృంగిన వేళలో ఓదార్పువై
కొదువలో సమృద్ధివై
నా అడుగులో అడుగువై         ||మరువగలనా||

English Lyrics

Audio

అమ్మా అని నిన్ను పిలువనా

పాట రచయిత: ఎస్ ఎస్ బ్రదర్స్ (శాంసన్ & స్టాలిన్)
Lyricist: S S brothers (Samson & Stalin)

Telugu Lyrics

అమ్మా అని నిన్ను పిలువనా
యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2)
అమ్మా… నాన్నా… (2)
(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా
ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2)
అమ్మా… నాన్నా… (2)
అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

ఎవరూ లేని ఒంటరి నేనయ్యా
ఎవరూ లేని అనాథను నేనయ్యా (2)
అమ్మా… నాన్నా… (2)
అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

నేనున్నాను భయమేలను అని
నాకభయమిచ్చిన నా యేసు రాజా (2)
అమ్మా… నాన్నా… (2)
అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

English Lyrics

Audio

నీ పాదాలే నాకు శరణం

పాట రచయిత: మాథ్యూస్
Lyricist: Matthews

Telugu Lyrics


నీ పాదాలే నాకు శరణం
యేసయ్యా నీవే ఆధారము (2)
నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2)
నా దాగు చాటు నీవే యేసయ్యా (2)       ||నీ పాదాలే||

అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2)
నా ఆశ్రయుడా నీ కన్నా నాకు
కనిపించదు వేరొక ఆశ్రయము (2)
కనిపించదు వేరొక ఆశ్రయము
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2)
నా పోషకుడా నీ కన్న నాకు
కనిపించరే వేరొక పోషకుడు (2)
కనిపించరే వేరొక పోషకుడు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2)
నా జయశీలుడా నీకన్న నాకు
కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2)
కనిపించరే జయమునిచ్చే వేరొకరు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

English Lyrics

Audio

యేసయ్యా నా హృదయాభిలాష

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2)

పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా        ||యేసయ్యా||

ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా         ||యేసయ్యా||

English Lyrics

Audio

ఆధారం నీవేనయ్యా

పాట రచయిత: ఎస్ రాజశేఖర్
Lyricist: S Rajasekhar

Telugu Lyrics

ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా         ||ఆధారం||

లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది       ||ఆధారం||

ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది         ||ఆధారం||

నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును          ||ఆధారం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME