చూచితి నీ మోముపై

పాట రచయిత: ఎం జ్యోతి రాజు
Lyricist: M Jyothi Raju

Telugu Lyrics

చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా
సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని
యేసు..                           ||చూచితి||

నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2)
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు (2)
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే (2)
యేసు..                           ||చూచితి||

సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను (2)
మా రోగములను – భరియించుటకు (2)
మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే (2)
యేసు..                           ||చూచితి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్య నామము

పాట రచయిత: ఆర్ ఎస్ వి రాజ్
Lyricist: RSV Raj

Telugu Lyrics


యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)

నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2)          ||యేసయ్య||

రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో (2)          ||యేసయ్య||

అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు (2)          ||యేసయ్య||

పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును (2)          ||యేసయ్య||

యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము (2)          ||యేసయ్య||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఎంత ప్రేమ యేసయ్యా

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics

ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు
ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు
సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను
సురూపమైనా సొగసైనా లేకపోయెను (2)
యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2)
నలిగిపోయెను – విరిగిపోయెను

ఎంత శ్రమను ఎంత బాధను
అనుభవించినాడే విభుడు (2)
మనకు క్షమాపణ ఇచ్చెను
అభయము కలుగజేసెను
హింసింపబడి దూషింపబడి
హింసింపబడి దూషింపబడెను
కరుణతో నను రక్షింప
నా కోసమే ఈ యాగమా        ||ఎంత ప్రేమ||

సమస్తము సంపూర్ణమాయెను
జీవముకై మార్గము తెరిచెను (2)
అపవాదిని అణచివేసి
మరణ ముల్లును విరచి వేసెను
విజయశీలుడై తిరిగి లేచెను
పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను
పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే

English Lyrics

Audio

సిలువను గెలిచిన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువను గెలిచిన సజీవుని త్యాగము
విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)
ముందే తెలియును – తన బలియాగము
తెలిసే చేసెను స్వ బలిదానము
తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము
తననే వంచెను తనువే అర్పించెను

దేవా నీ త్యాగము మము రక్షించెను
పాపము నుండి విడిపించెను
దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను
ఇల సజీవులుగా మేము నిలిపెను        ||సిలువను||

English Lyrics

Audio

యేసయ్య రక్తము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్య రక్తము అతి మధురము
ఎంతో విలువైన రక్తము
నీ పాపములను నా పాపములను
క్షమియించిన రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

ప్రతి బంధకమును ప్రతి కాడియును
విరగగొట్టును – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

ప్రతి నాలుకయు ప్రతి మోకాలు
లోబరచును నా – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

ప్రతి శాపములకు ప్రతి రోగములకు
విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

English Lyrics

Audio

ఇమ్మానుయేలు రక్తము

పాట రచయిత: విలియం కౌపర్
Lyricist: William Cowper

Telugu Lyrics

ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును

యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా

ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు

నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ
రక్తంబే చాలును

నా నాదు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్

నా ఆయుష్కాల మంతటా
నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన-మిద్దియే

English Lyrics

Audio

మోసితివా నా కొరకై

పాట రచయిత: జాయ్ కెల్విన్
Lyricist: Joy Kelvin

Telugu Lyrics


మోసితివా నా కొరకై సిలువ వేదనను
గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో
సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును
పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము            ||మోసితివా||

అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్
ఏలీ ఏలీ లామా సబక్తానీ చే విడిచి
దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా
ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజని
హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో
దేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో           ||మోసితివా||

తర తరాల ఈ లోకం – యుగయుగాల నీ నామం
తరగని వేదన నీకు సిలువ విజయమునకే
కల్వరి ధారా నాథా పాపికి ప్రాణ ప్రదాత
విలువగు రక్త ప్రదాత ఆశ్రిత రక్షణ రాజా
చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే
అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువా            ||మోసితివా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అమూల్య రక్తము ద్వారా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2)
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2)        ||అమూల్య||

చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2)
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2)        ||అమూల్య||

నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2)
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2)        ||అమూల్య||

కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2)
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2)        ||అమూల్య||

తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2)
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2)        ||అమూల్య||

పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2)
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2)        ||అమూల్య||

మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2)
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2)        ||అమూల్య||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

నా సంకట దుఃఖములెల్ల

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2)   ||నా సంకట||

విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)
కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2)           ||నా సంకట||

ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)
ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2)           ||నా సంకట||

మార్చబడు నాడు మారా మధురముగా (2)
పారు జలము బండనుండి త్రాగుచుండును (2)           ||నా సంకట||

సౌందర్యమయమగు పరమ కానాను (2)
నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2)           ||నా సంకట||

ఆనందమే పరమానందమే (2)
కానాను జీవితము నా కానందమే (2)           ||నా సంకట||

నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2)
నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2)           ||నా సంకట||

నా యేసు ప్రభువే నా బలము గానము (2)
నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2)           ||నా సంకట||

English Lyrics

Audio

అందరికి కావాలి

పాట రచయిత: శైలన్న
Lyricist: Sailanna

Telugu Lyrics

అందరికి కావాలి యేసయ్య రక్తము (2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము (2)

కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము (2)
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము (2)            ||అందరికి||

కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది (2)           ||అందరికి||

చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము (2)
రక్తములోనే ప్రాణమున్నది
పాపము కడిగే గుణమున్నది (2)
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది (2)          ||అందరికి||

English Lyrics

Audio

HOME