ఆశీర్వాదం

పాట రచయితలు: స్టీవెన్ ఫర్టిక్, క్రిస్ బ్రౌన్, కరి జోబ్, కోడి కార్నెస్
తెలుగు రచయిత: ప్రసన్న కుమార్ కాకి
Lyricists: Steven Furtick, Chris Brown, Kari Jobe, Cody Carnes
Telugu Lyricist: Prasanna Kumar Kaki

Telugu Lyrics

యెహోవా దీవించి – కాపాడును గాక
తన సన్నిధి కాంతితో
నిను కరుణించును గాక
నీ వైపు తన ముఖమును చూపి
శాంతినిచ్చును గాక (2)

ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్
ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్

యెహోవా దీవించి – కాపాడును గాక
తన సన్నిధి కాంతితో
నిను కరుణించును గాక
నీ వైపు తన ముఖమును చూపి
శాంతినిచ్చును గాక

ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్
ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (2)

తన జాలి – నీ పైన
వెయ్యి తరములు – ఉండు గాక
నీ వంశం – సంతానం
వారి పిల్లల – వారి పిల్లలు (4)

నీ ముందు – నీ వెనుక
నీ పక్కన – నీ చుట్టూ
నీతోనూ – నీలోనూ
తన సన్నిధి ఉండు గాక

ఉదయాన – సాయంత్రం
నీ రాక – పోకలలో
కన్నీటిలో – సంతోశంలో
నీ పక్షం – నీ తోడు
నీ నీడగా – ఉంటాడు
మన ప్రభువు – నీ వాడు
నా వాడు – మన వాడు

ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్
ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్

తన జాలి – నీ పైన
వెయ్యి తరములు – ఉండు గాక
నీ వంశం – సంతానం
వారి పిల్లల – వారి పిల్లలు

నీ ముందు – నీ వెనుక
నీ పక్కన – నీ చుట్టూ
నీతోనూ – నీలోనూ
తన సన్నిధి ఉండు గాక

ఉదయాన – సాయంత్రం
నీ రాక – పోకలలో
కన్నీటిలో – సంతోషంలో
నీ పక్షం – నీ తోడు
నీ నీడగా – ఉంటాడు
మన ప్రభువు – నీ వాడు
నా వాడు – మన వాడు

నీ కోసం ఉంటాడు – నీ కోసం ఉంటాడు
నీ కోసం ఉంటాడు – నీ కోసం ఉంటాడు

ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్
ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (3)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అద్వితీయ సత్య దేవా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా
వందనం వందనం వందనం

అద్వితీయ సత్య దేవా వందనం – వందనం
పరమ తండ్రి పావనుండా వందనం – వందనం
దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం
పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

వ్యోమ సింహాసనుండ వందనం – వందనం
ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2)
ఆద్యంత రహిత నీకే వందనం – వందనం
అక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2)           ||హల్లెలూయా||

ప్రాణదాత యేసునాథా వందనం – వందనం
ముక్తిదాత జీవదాతా వందనం – వందనం (2)
సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనం
ముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం (2)           ||హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ముక్తి దిలాయే యీషు నామ్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ముక్తి దిలాయే యీషు నామ్
శాంతి దిలాయే యీషు నామ్ (2)

ధరణి మే తూనే జన్మ లియా యీషు (2)
సూలి పర్ హువాఁ విశ్రామ్ (2)    ||ముక్తి||

క్రూస్ పర్ అప్నా కోన్ బహాయ (2)
సారా చుకాయ దామ్ (2)    ||ముక్తి||

యీషు దయాక బెహతా సాగర్ (2)  
యీషు హై దాత మహాన్ (2)    ||ముక్తి||

హమ్ సబ్ కే పాపోంకో మిటానే (2)
యీషు హువాఁ బలిదాన్ (2)    ||ముక్తి||

హమ్ పర్ భీ యీషు క్రిపా కర్ నా (2)
హమ్ హై పాపి నాదాన్ (2)    ||ముక్తి||

English Lyrics

Audio

దైవ కుటుంబం

పాట రచయిత: కోటి బాబు
Lyricist: Koti Babu

Telugu Lyrics


దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)
శాంతి సంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)
ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)
దైవ కుటుంబపు సంతోషం
కని విని ఎరుగని ఆనందం (4)        ||దైవ కుటుంబం||

రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం (2)
అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత
షడ్రుచుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట (2)
అష్టైశ్వర్యాలకు తూలతూగే కుటుంబం (2)
తరతరాలు వర్ధిల్లే కుటుంబం (2)         ||దైవ కుటుంబపు||

మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం
ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు (2)
భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు
మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు(2)
పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం (2)         ||దైవ కుటుంబపు||

English Lyrics

Audio

మెల్లని చల్లని

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
ఉల్లమంతటిని నింపు ఆనందము
అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్       ||మెల్లని||

శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా
మంచిదంతటిని మాటతో చేసెను
పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము
పావనపరచెడి పరిశుద్ధుని స్వరము       ||మెల్లని||

స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున
దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం
కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో       ||మెల్లని||

గాలి తుఫానులన్ అణచిన స్వరమది
భీతి భయములన్ని బాపెడి స్వరమది
అంత్య దినమందున మృతుల లేపునుగా
అందరికి తీర్పును తీర్చి పాలించును       ||మెల్లని||

మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను
మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను
మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా
మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా       ||మెల్లని||

English Lyrics

Audio

మంచి దేవుడు నా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మంచి దేవుడు నా యేసయ్యా
చింతలన్ని బాపునయ్యా
హృదయ వాంఛతో చేరిన వారికి
శాంతి జీవము ఇచ్చునయ్యా (2)
మహిమా ఘనత ప్రభావము నీకే (2)

కృపల వెనక కృపను చూపి
విడువక నీ కృపలను చూపిన (2)
కృపగల నా యేసు రాజా
నీ కృప నాకు చాలునయ్యా (2)         ||మహిమా||

మహిమ వెంట మహిమ నొసగి
నీ రూపమున నన్ను మార్చి (2)
మహిమతో నీవుండు చోటుకి
మమ్ము ప్రేమతో పిలచితివి (2)         ||మహిమా||

జయము వెంట జయమునిచ్చి
జయ జీవితము మాకు ఇచ్చి (2)
జయశీలుడు నా యేసు ప్రభువని
జయము జయమని పాడెదను (2)         ||మహిమా||

English Lyrics

Audio

కలువరి గిరి సిలువలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2)         ||కలువరి||

కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – (2)         ||కలువరి||

జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – (2)         ||కలువరి||

English Lyrics

Audio

జీవ నాథ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జీవ నాథ ముక్తి దాత
శాంతి దాత పరమాత్మ
పావనాత్మ పరుగిడి రావా
నా హృదిలో నివసింప రావా
నీ రాక కోసం వేచియున్నాను
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)

ముక్తి ప్రసాదించుము
భక్తిని నేర్పించుము
నీ ఆనందముతో నను నింపుము – (2)
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)      ||జీవ నాథ||

నీ శాంతి నింపంగ రావా
నీ శక్తి నింపంగ రావా (2)
నీ పరమ వారములతో నింపేవా (2)
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)      ||జీవ నాథ||

English Lyrics

Audio

యేసు దేవా నను కొనిపోవా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు దేవా నను కొనిపోవా
నీ రాజ్యముకై వేచియున్నా (2)
శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది
శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది
నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను
అంత వరకు నీదు శక్తినిమ్మయా
నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను
అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము        ||యేసు||

ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది
ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2)
నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2)         ||యేసు||

నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2)
నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము
నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను         ||యేసు||

English Lyrics

Audio

నేడే ప్రియరాగం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నేడే ప్రియరాగం పలికే నవ గీతం
ప్రేమే మన కోసం వెలసే
లోకాన శాంతి మురిసింది
మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది        ||నేడే||

దివినేలు దేవుడు ఉదయించగానే
ఇలలోన ప్రకృతి పులకించెగా
పరలోక దూతలు స్తుతియించగానే
జగమంతా ఉప్పొంగి నర్తించెగా           ||నేడే||

మనిషైన సుతుడు జనియించగానే
విశ్వాన గోళాలు విభవించెగా
చిన్నారి యేసుని చిరునవ్వుతోనే
నవ కాంతి లోకాన ప్రభవించెగా        ||నేడే||

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
హ్యాప్పీ క్రిస్మస్ టు యు…
లోకాన శాంతి మురిసింది
మన మనస్సులో రాగాల కాంతి విరిసింది

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME