తరచి తరచి

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesly

Telugu Lyrics

తరచి తరచి చూడ తరమా
వెదకి వెదకి కనుగొనగలమా
యేసు వంటి మిత్రుని లోకమందున
విడచి విడచి ఉండగలమా
మరచి మరచి ఇలా మనగలమా
యేసు వంటి స్నేహితుని విశ్వమందున

లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా
ఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలో
నేల మంటిలోన పరమార్ధం లేదుగా
ఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగా
నమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకై
జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2)         ||తరచి||

లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరు
యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు
పదివేలలోన అతి కాంక్షణీయుడు
కలతలన్ని తీర్చి కన్నీటిని తుడచును
కల్వరిగిరిలోన కార్చెను రుధిరం
హృదయమందు చేర్చుకో కృప చూపు నాథుని (2)         ||తరచి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కలువరి గిరి సిలువలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2)         ||కలువరి||

కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – (2)         ||కలువరి||

జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – (2)         ||కలువరి||

English Lyrics

Audio

నీ కృప నిత్యముండును

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప||

శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప||

ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప||

అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)        ||నీ కృప||

English Lyrics

Audio

నా హృదయములో

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు (2)
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2)        ||నా హృదయములో||

మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు         ||నీ కార్యములను||

విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు         ||నీ కార్యములను||

పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు         ||నీ కార్యములను||

English Lyrics

Audio

ఏమని పాడను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఏమని పాడను – ఏమని పొగడను (2)
నాదు దేవా – లోకనాథా
నీదు నామం – పాడ తరమా
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే         ||ఏమని||

నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
నీవేగా యేసువే (2)
నిన్ను పాడి స్తుతించుట
ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి         ||ఏమని||

జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే
నా ఆశ నీవేగా (2)
దిన దినము నీ ప్రేమ
బాటలో నడువ నాకు నేర్పుము (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి         ||ఏమని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

సమీపించరాని తేజస్సులో నీవు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)        ||సమీపించరాని||

ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2)      ||యేసయ్యా||

మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2)     ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

HOME