ఏగెదను నే చేరెదను

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

ఏగెదను నే చేరెదను
సీయోనును నే చూచెదను (2)
విశ్వాస కర్తయైన నా యేసూ (2)
నీ సముఖములో నే మురిసెదను
నీ కౌగిలిలో ఉప్పొంగెదను (2)
జీవ కిరీటమును నే పొందెదను      ||ఏగెదను||

భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను
యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును (2)
దినదినము నాలో నే చనిపోవుచున్నాను
అనుదినము నీలో బ్రతుకుచున్నాను (2)
అనుదినము నీలో బ్రతుకుచున్నాను      ||ఏగెదను||

నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము
సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను (2)
మంచి పోరాటముతో నా పరుగును
కడముట్టించి జయమొందెదను (2)
విశ్వాసములో జయమొందెదను      ||ఏగెదను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మట్టినైన నన్ను

పాట రచయిత: పి కిషోర్ కుమార్
Lyricist: P Kishore Kumar

Telugu Lyrics


మట్టినైన నన్ను మనిషిగా మార్చి
జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2)
ఎంత పాడినా – ఎంత పొగిడినా
ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా
నీ ఋణమును నేను తీర్చలేనయ్యా
నా యేసురాజా నా దైవమా (2)

నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే
నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే (2)
నీ ధర్మశాస్త్రము యధార్థమైనది (2)
అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును (2)    ||ఎంత పాడినా||

అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవే
కృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము నీవే (2)
నీ సిలువ మరణము ఘోరాతి ఘోరం (2)
విశ్వ మానవాళికి పాపవిమోచన (2)    ||ఎంత పాడినా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సాగేటి ఈ జీవ యాత్రలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సాగేటి ఈ జీవ యాత్రలో
రేగేను పెను తుఫానులెన్నో (2)
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2)
యేసయ్యా.. ఓ మెసయ్యా
హల్లెలూయా నీకే స్తోత్రమయా (2)            ||సాగేటి||

సుడి గాలులెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2)
నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2)
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2)          ||యేసయ్యా||

వడ గాటులెన్నో నా పయనములోన
నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2)
తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2)
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే (2)          ||యేసయ్యా||

అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన
చెలరేగి విలవిలలాడించే సమయాన (2)
నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే (2)
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే (2)          ||యేసయ్యా||

 

English Lyrics

Audio

ప్రేమగల యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రేమగల యేసయ్యా
జీవ వృక్షమా యేసయ్యా (2)
సిలువలో బలి అయిన యేసయ్యా
తులువలో వెలి అయిన యేసయ్యా (2)
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా       ||ప్రేమగల||

యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా
రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా
కొరడాల దెబ్బలు చెళ్లుమనెను
శరీరపు కండలే వేలాడేను (2)
నలిగిపోతివా నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడా||

యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు
ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు
గడ్డము పట్టాయనను లాగుచుండగా
నాగటి వలె సిలువలో దున్నబడగా (2)
ఒరిగిపోతివా నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడా||

యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా
మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే
తనువంత రుధిరముతో తడిసిపోయెనే
తండ్రీ అని కేక వేసి మరణించెనే (2)
మూడవ దినాన తిరిగి లేచెను (2)        ||పరిశుద్ధుడా||

English Lyrics

Audio

జీవ నాథ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జీవ నాథ ముక్తి దాత
శాంతి దాత పరమాత్మ
పావనాత్మ పరుగిడి రావా
నా హృదిలో నివసింప రావా
నీ రాక కోసం వేచియున్నాను
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)

ముక్తి ప్రసాదించుము
భక్తిని నేర్పించుము
నీ ఆనందముతో నను నింపుము – (2)
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)      ||జీవ నాథ||

నీ శాంతి నింపంగ రావా
నీ శక్తి నింపంగ రావా (2)
నీ పరమ వారములతో నింపేవా (2)
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)      ||జీవ నాథ||

English Lyrics

Audio

మార్గము నీవని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మార్గము నీవని – గమ్యము నీవని – (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సుగమమాయెనే జీవ యాత్ర
ప్రాణము నీవని – దేహము నీదని – (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
చైతన్యమొందెనే జీవ యాత్ర

బాధల బరువులో – నిత్య నిరాశలో
శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2)
శాంతము నీవని – స్వస్థత నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
ఆనందమాయెనే జీవ యాత్ర         ||మార్గము||

ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా
గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా (2)
ధాత్రము నీవని – స్తోత్రము నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సంగీతమాయెనే జీవ యాత్ర        ||మార్గము||

English Lyrics

Audio

సర్వ సృష్టిలోని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా         ||సర్వ||

ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి      ||నీవే||

నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ
నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి        ||నీవే||

English Lyrics

Audio

కాలం సమయం నాదేనంటూ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది (2)
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2)        ||కాలం||

ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2)         ||ఆగవేమయ్యా||

చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2)         ||ఆగవేమయ్యా||

సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు (2)           ||ఆగవేమయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా (2)       ||గొర్రెపిల్ల||

ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా (2)
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2)
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

English Lyrics

Audio

జీవనదిని నా హృదయములో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)

శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2)       ||జీవ నదిని||

బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2)         ||జీవ నదిని||

ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2)         ||జీవ నదిని||

ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2)        ||జీవ నదిని||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME