క్రిస్మస్ కాలం

పాట రచయిత: సురేష్ నిట్టల
Lyricist: Suresh Nittala

Telugu Lyrics

క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)     ||క్రిస్మస్ కాలం||

పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో
లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)
యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2)     ||క్రిస్మస్ కాలం||

కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను
బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)
దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2)     ||క్రిస్మస్ కాలం||

ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2)
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)     ||క్రిస్మస్ కాలం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

విలువైనది నీ ఆయుష్కాలం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2)            ||విలువైనది||

బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2)            ||విలువైనది||

మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2)            ||విలువైనది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవే నీవే కావాలి

పాట రచయిత: పాల్ ఇమ్మానుయేల్ & నిస్సీ పాల్
Lyricist: Paul Emmanuel & Nissy Paul

Telugu Lyrics

నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2)       ||నీవే||

నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా (2)
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా (2)      ||ఈ కాలం||

పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం (2)      ||ఈ కాలం||

నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా (2)      ||ఈ కాలం||

English Lyrics

Audio

యేసయ్యా నిన్ను ప్రేమించువారు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నిన్ను ప్రేమించువారు
బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)
శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారు
సకలమైన ఉపద్రవముల నుండి (2)
నిర్దోషులై కాపాడబడెదరు
అపవాది అగ్ని బాణముల నుండి (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారు
దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)
సమకూడి జరుగును సమస్తము
సదా మాతో ఉన్నందున (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారిని
ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)
మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి
తప్పించి బలపరచినావు (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారి
చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)
వారి కాలమంతట దేశమంతయు
నెమ్మదిగా నుండును (2)       ||యేసయ్య||

English Lyrics

Audio

ఈ దినమెంతో శుభ దినము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం     ||ఈ దినమెంతో||

నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం       ||ఈ దినమెంతో||

జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం      ||ఈ దినమెంతో||

English Lyrics

Audio

ఇన్నేళ్లు ఇలలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం          ||ఇన్నేళ్లు||

లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం      ||ఇన్నేళ్లు||

మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించునే కలకాలం           ||ఇన్నేళ్లు||

English Lyrics

Audio

నీ దయలో నేనున్న

పాట రచయిత: బద్దె హీవెన్ బాబు
Lyricist: Badde Heaven Babu

Telugu Lyrics


నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా…          ||నీ దయలో||

తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని           ||నీ దయలో||

నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని           ||నీ దయలో||

English Lyrics

Audio

కాలం సమయం నాదేనంటూ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది (2)
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2)        ||కాలం||

ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2)         ||ఆగవేమయ్యా||

చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2)         ||ఆగవేమయ్యా||

సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు (2)           ||ఆగవేమయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆధారం నీవేనయ్యా

పాట రచయిత: ఎస్ రాజశేఖర్
Lyricist: S Rajasekhar

Telugu Lyrics

ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా         ||ఆధారం||

లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది       ||ఆధారం||

ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది         ||ఆధారం||

నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును          ||ఆధారం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ప్రభువా కాచితివి

పాట రచయిత: క్రీస్తు దాస్
Lyricist: Kreesthu Das

Telugu Lyrics

ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)
నీ సాక్షిగా నే జీవింతునయ్యా         ||ప్రభువా||

కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2)
నన్ను వలచావులే – మరి పిలిచావులే (2)
అరచేతులలో నను చెక్కు కున్నావులే (2)       ||ప్రభువా||

నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)
పాపము కడిగావులే – విషము విరచావులే (2)
నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2)       ||ప్రభువా||

బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)
నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2)
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2)       ||ప్రభువా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME