కంటిపాపలా కాచినావయ్యా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా
చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా
పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా
నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా
మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా
మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా           ||కంటిపాపలా||

ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా
దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా
అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా
అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా
ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా
చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా
కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు
ఎనలేని ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము
ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము
హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా
లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా
చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా
అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా
పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు
నీ గొప్ప ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

Download Lyrics as: PPT

సుదూరము ఈ పయనము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము       ||సుదూరము||

అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం       ||సుదూరము||

హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును       ||సుదూరము||

నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ       ||సుదూరము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పదే పాడనా

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా (2)
నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా
ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య         ||పదే పాడనా||

ప్రేమను పంచే నీ గుణం – జీవము నింపే సాంత్వనం
మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం
నీవే నాకు ప్రభాతము – నాలో పొంగే ప్రవాహము
నీవే నాకు అంబరం – నాలో నిండే సంబరం
నాలోన మిగిలే నీ ఋణం – నీతోటి సాగే ప్రయాణం        ||పదే పాడనా||

మహిమకు నీవే రూపము – మధురము నీదు నామము
ఇదిగో నాదు జీవితం – ఇలలో నీకే అంకితం
నీవే నాకు సహాయము – నిన్న నేడు నిరంతరం
నీవే నాకు ఆశయం – నాలో నీకే ఆలయం
ధరలోన లేరు నీ సమం – నీ ప్రేమధారే నా వరం          ||పదే పాడనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇన్నాళ్లు తోడుగా

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)

ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా (2)
ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)      ||ఇశ్రాయేలు||

మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2)      ||ఇశ్రాయేలు||

English Lyrics

Audio

కంటి పాపను

పాట రచయిత: మని ప్రకాష్
Lyricist: Mani Prakash

Telugu Lyrics

కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా      ||కంటి||

మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ         ||కంటి||

ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ        ||కంటి||

English Lyrics

Audio

Chords

నీ సన్నిధియే నా

పాట రచయిత:దివ్య డేవిడ్
Lyricist: Divya David

Telugu Lyrics


నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2)
మహిమ గల నా యేసు రాజా (2)      ||నీ సన్నిధియే||

ఆలయములో ధ్యానించుటకు
ఒక వరము అడిగితి యేసుని (2)
నీ ప్రసన్నత నాకు చూపుము (2)      ||నీ సన్నిధియే||

ఆపత్కాలమున నన్ను నీ
పర్ణశాలలో దాచినావు (2)
నీ గుడారపు మాటున (2)      ||నీ సన్నిధియే||

English Lyrics

Audio

తెలియదా? నీకు తెలియదా?

పాట రచయిత: ప్రసన్న బోల్డ్
Lyricist: Prasanna Bold

Telugu Lyrics


తెలియదా? నీకు తెలియదా?
యేసు తోడుగా ఉన్నాడని (4)

నీవే సాక్షి యేసే దేవుడని
యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2)
యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2)

తెలియదా? నీకు తెలియదా?
యేసుకున్నదంతా నువ్వేనని (4)

నీ మౌనం పరలోకపు మౌనమని
నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2)
నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2)

తెలియదా? నీకు తెలియదా?
నీవు జత పని వాడవని
తెలియదా? నీకు తెలియదా?
దేవుని జత పని వాడవని (2)

నీ బలహీనతలో యేసే నీ బలం
నీ అవమానములో యేసే నీ ఘనం (2)
నీ అవమానములో యేసే నీ ఘనం (2)

తెలియదా? నీకు తెలియదా?
రాయబారివి అని
తెలియదా? నీకు తెలియదా?
దేవుని రాయబారివి అని (2)

అడుగుము జనములను స్వాస్థ్యముగా ఇచ్చును
భూమిని దిగంతముల వరకు సొత్తుగా మార్చును (2)
నీ శత్రువులందరిని పాదపీఠముగ చేయును (2)

తెలియదా? నీకు తెలియదా?
వారసుడు నువ్వేనని
తెలియదా? నీకు తెలియదా?
దేవుని వారసుడు నువ్వేనని (2)

తెలియదా? ఆ ఆ ఆ (2)
నీకు తెలియదా? ఆ ఆ ఆ (2)
నీకు తెలియదా?
తెలియదా? (4)

English Lyrics

Audio

HOME