ఎంత మంచి కాపరి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2)
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య (2)           ||ఎంత||

సుఖములంటూ లోకమంటూ
నీదు భాగ్యం మరచితి
నీదు సన్నిధి విడచితి (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి (2)         ||ఎంత||

నా తలంపులు నా క్రియలు
నీకు తెలిసేయున్నవి
నీవే నిర్మాణకుడవు (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
కృతజ్ఞతా స్తుతులు నీకు
సమర్పించెదను (2)         ||ఎంత||

English Lyrics

Audio

యేసే జన్మించెరా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే జన్మించెరా
తమ్ముడా దేవుడవతారించేరా (2)
ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4)        ||యేసే||

పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ (2)
అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2)        ||యేసే||

బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2)
నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2)        ||యేసే||

English Lyrics

Audio

షారోను రోజా యేసే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2)
ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని
ప్రాణప్రియుని కనుగొంటిని (2)
అడవులైనా లోయలైనా
ప్రభు వెంట నేను వెళ్ళెదను (2)        ||షారోను||

యేసుని ఎరుగని వారెందరో
వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)
దప్పికతో ఉన్న ప్రభువునకే (2)
సిలువను మోసే వారెవ్వరు (2)      ||అడవులైనా||

సీయోను వాసి జడియకుము
పిలిచిన వాడు నమ్మదగినవాడు (2)
చేసిన సేవను మరువకా (2)
ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2)        ||అడవులైనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

యేసే గొప్ప దేవుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2)         ||యేసే||

మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

యేసే దైవము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే దైవము – యేసే జీవము
నా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2)
మహిమా నీకే ఘనతా నీకే
నిన్నే పూజించి నే ఆరాధింతును

యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా (3)       ||యేసే||

English Lyrics

Audio

కొండ కోన లోయలోతుల్లో

పాట రచయిత: ప్రభు భూషణ్
Lyricist: Prabhu Bushan

Telugu Lyrics

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
వినబడుతుంది నా యేసుని స్వరమే
తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన ||

నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని (2)
కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

English Lyrics

Audio

తోడు లేరని కుమిలిపోకు

పాట రచయిత: బాబన్న
Lyricist: Babanna

Telugu Lyrics


తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||

ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2) |      |ఓహో సోదరా||

విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)         ||ఓహో సోదరా||

English Lyrics

Audio

ఎవరికి ఎవరు

పాట రచయిత: బాబన్న
Lyricist: Babanna

Telugu Lyrics

ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||

ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||

ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||

మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||

English Lyrics

Audio

యేసే నా మార్గము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే నా మార్గము
యేసే నా సత్యము
జీవమని పాడెదం (2)

పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు
ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని స్వస్థపరచువాడు         ||యేసే నా||

యేసే నా సర్వము యేసే నా సమస్తము
ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని స్వస్థపరచువాడు        ||యేసే నా||

యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్
యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

యేసుని నా మదిలో

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


యేసుని నా మదిలో స్వీకరించాను
ఆయన నామములో రక్షణ పొందాను (2)
నేను నేనే కాను… నాలో నా యేసే… (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ          ||యేసుని||

పాతవి గతియించెను
క్రొత్తవి మొదలాయెను (2)
నా పాప హృదయింలో రారాజు జన్మించె
నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2)
యేసే నా జీవం…
ఆ ప్రభువే నా దెైవం (2)           ||హల్లెలూయ||

నీ పాపం తొలగాలన్నా
నీ దుుఃఖం కరగాలన్నా (2)
యేసుని నీ మదిలోకి స్వీకరించాలి
ఆయన నామములోనే రక్షణ పొందాలి (2)
యేసే మన జీవం…
ఆ ప్రభువే మన దెైవం (2)     ||హల్లెలూయ||

నీవు నమ్మితే రక్షణ
నమ్మకున్నచో శిక్షయే (2)
ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో
విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2)
ఈ క్షణమే నీవు తేల్చుకో…
ఇదియే అనుకూల సమయము (2)       ||హల్లెలూయ||

English Lyrics

Audio

HOME